ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ మరింతగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 7902 శాంపిల్స్ పరీక్షించగా 60 మంది కోవిడ్19 పాజిటివ్‌గా నిర్దారించారు. తాజాగా ఇద్దరు వ్యక్తులు కరోనా కాటుకు బలయ్యారు. దీంతో ఏపీలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు 1463కు చేరాయి. మొత్తం పాజిటివ్ కేసులకుగాను చికిత్స అనంతరం 403 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, 33 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1027. కంటైన్మెంట్ జోన్లంటే ఏంటి, ఎలా వర్గీకరిస్తారు?
కర్నూలు జిల్లాలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ఆ జిల్లాలో 400కు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. కర్నూలు జిల్లాలో ఏకంగా 411 కేసులు నమోదుయ్యాయి. గుంటూరు జిల్లాలో 306 కరోనా కేసులు, కృష్ణా జిల్లలా 246 కేసులతో కరోనా తీవ్రతను ఎదుర్కొంటున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 25 పాజిటివ్ కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 19, కడప, అనంతపురం జిల్లాల్లో 6 చొప్పున, విశాఖలో 2, పశ్చిమ గోదావరిలో 2 కేసులు నమోదయ్యాయి. మే నెలలో బ్యాంకు సెలవులు ఇవే..
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా!