గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు..

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం ప్రదర్శిస్తోంది. కరోనా వైరస్ రోజురోజుకు వేగంగా విజృంభిస్తోంది. ఎన్నడూ లేనంతగా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 2,487 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, కరోనాతో 

Last Updated : May 3, 2020, 09:50 PM IST
గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు..

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం ప్రదర్శిస్తోంది. కరోనా వైరస్ రోజురోజుకు వేగంగా విజృంభిస్తోంది. ఎన్నడూ లేనంతగా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 2,487 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో 83 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య మంత్రివత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 40,263కు చేరింది. మరోవైపు కరోనా బారిన పడి ఇప్పటివరకు 1,306 మంది మరణించారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 28,070 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, ఇప్పటివరకు 10,887 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపారు. కాగా రెండో దశ లాక్ డౌన్ పూర్తయి మూడో దశ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సడలింపులతో వివిధ కార్యాలయాలు ప్రారంభించాలని ఢిల్లీ ప్రభుత్వం యోచిస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News