ఢిల్లీ: మరికొన్నిరోజుల్లో రుతుపవనాల సీజన్ ప్రారంభం కాబోతుండగా, దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సూర్యతాపం ఎన్నడూ లేనంతగా విపరీతంగా పెరిగిపోవడంతో దేశ రాజధానిలో ఉక్కపోతతో బిక్కు బిక్కుమంటున్నారు. కాగా ఈ రోజు(ఆదివారం) మధ్యాహ్నం 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం పరిస్థితి మరింత విపత్కరంగా ఏర్పడింది. కాగా ఇప్పటికే వేడి గాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్న నేపథ్యంలో తాజాగా మరో రెండు రోజుల్లో ఇంకా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Also Read:మళ్లీ విమానయానం షురూ..!!
మరోవైపు వచ్చే వారం రోజుల్లో ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాలైనా హర్యానా, పంజాబ్, చండీఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మరింతగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ విభాగం (IMD) హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో, పిల్లలు, వృద్ధులు బయటికి రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. పశ్చిమ దిక్కు నుండి వస్తున్న వేడి గాలులు, తీర ప్రాంతాల్లో ఉక్కపోత వాతావరణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఉక్కపోత ప్రభావం మే 28 తరవాత స్వల్ప వర్షాలతో తగ్గుముఖం పెట్టొచ్చని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..