PMUY Ujjwala Scheme : భారత దేశంలో కరోనావైరస్ ( Covid-19 In India ) సంక్రమణ పెరిగిన నేపథ్యంలో భారత ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలకు లబ్ధికలిగించడానికి పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (PMGKY) కార్యక్రమంలో భాగంగా 8 కోట్ల కుటుంబాలు మూడు నెలల పాటు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ( Free Cylinders ) ఇస్తామని తెలిపింది ప్రభుత్వం. ఏప్రిల్, మే, జూన్ మాసంలో ఈ పథకంలో భాగంగా ప్రజలు ప్రయోజనం పొందారు. తాజాగా భారత ప్రభుత్వం ఈ పథకాన్ని మరికొంత కాలం కొనసాగించనున్నట్టు ప్రకటించింది.
#Cabinet approves extension of time limit for availing the benefits of "Pradhan Mantri Garib Kalyan Yojana" for #Ujjwala beneficiaries by 3 months w.e.f. 01.07.2020: Union Minister @PrakashJavdekar #CabinetDecisions pic.twitter.com/IGf4RclJsp
— PIB India (@PIB_India) July 8, 2020
కోవిడ్-19 (Coronavirus ) పరిస్థితులను గమనించి మరో మూడు నెలల పాటు ఉచితంగా ఉజ్వల సిలిండర్లు ( Free Ujjwala Cylinder ) ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ( Prakash Javadekar ) ఈ మేరకు ప్రకటన చేస్తూ 30 సెప్టెంబర్ వరకు ఈ పథకం కొనసాగనుంది అని తెలిపారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
England Vs West Indies: ప్రేక్షకులు లేని టెస్టు మ్యాచు గురించి 10 ఆసక్తికరమైన విషయాలు
Bio-bubble: బయోబబుల్ అంటే ఏంటి? ఆటగాళ్లు పూర్తిగా సురక్షితమా ?