/telugu/photo-gallery/actress-sri-reddy-apology-and-emotional-letter-to-former-cm-ys-jagan-family-pa-180817 Sri Reddy Letters: జగనన్న సారీ..  ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. Sri Reddy Letters: జగనన్న సారీ.. ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. 180817

Terrorists attacks: న్యూ ఢిల్లీ: కశ్మీర్‌లో ఉగ్రవాదులు పుల్వామా దాడి తరహాలో మరో ఉగ్ర దాడికి పాల్పడే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు చేసిన హెచ్చరికల నేపథ్యంలో కశ్మీర్‌లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా శ్రీనగర్-బారాముల్లా హైవేపై వెళ్లే భద్రతా బలగాలపై లష్కరే తొయిబా ఉగ్రవాదులు ( Let terrorists ) దాడికి పాల్పడే అవకాశం ఉందని నిఘావర్గాలు పేర్కొన్నాయి. బారాముల్లాలోని పటాన్ ప్రాంతం నుంచి హెచ్ఎంటీ వరకు ఎక్కడైనా పుల్వామా దాడి తరహాలో ( Pulwama attacks ) కారుతో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడటానికి కుట్రపన్నుతున్నట్టు సమాచారం అందినట్టు నిఘావర్గాలు తెలిపాయి. ( Also read: పూల్వామా తరహా దాడికి కుట్ర )

పుల్వామా దాడి తరహాలో విధ్వంసానికి పాల్పడేందుకు కుట్ర పన్నుతున్న లష్కరే తొయిబా ఉగ్రవాదులు ఇప్పటికే ఈ విధ్వంసానికి సంబంధించి రెక్కీ ( Recce) కూడా పూర్తి చేసినట్టు నిఘావర్గాల వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. రహ్మాన్ భాయ్ అనే విదేశీ ఉగ్రవాది ఈ దాడికి రెక్కీ నిర్వహించినట్టు నిఘావర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా అంబులెన్స్ ( Ambulance ) ద్వారా ఉగ్రవాదులను ఈ ప్రాంతంలోకి తరలించే అవకాశం కూడా లేకపోలేదని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ( Also read: COVID-19 vaccine: కోవిడ్-19 వ్యాక్సిన్‌పై స్పష్టత వచ్చేసింది )

నిఘావర్గాల హెచ్చరికలతో జమ్మూకశ్మీర్‌లోని పఠాన్, సోపోర్, హంద్వారా ప్రాంతాల్లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. భద్రతా బలగాలకు వీలైనంత ఎక్కువ నష్టం చేకూరేలా భారీ శక్తివంతమైన ఐఈడి పేలుడు పదార్థాలతో దాడికి పాల్పడే అవకాశం ఉందని తెలిసినట్టు ఓ భద్రతాధికారి తెలిపారు. ఆ మార్గంలో వెళ్లే భద్రతా బలగాలు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కాన్వాయ్క్ష్‌లను అనుమతించాల్సిందిగా నిఘావర్గాలు సూచించాయి. ( Also read: COVID-19 drugs: ప్రిస్క్రిప్షన్ లేనిదే ఇవి విక్రయించరాదు )

ఇదిలావుంటే, బారాముల్లాలోని డీపీఎస్ కాలనీలో ఓ ఆల్టో కారు చోరీకి గురవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పుల్వామా తరహాలో దాడికి కుట్ర పన్నుతున్న ఉగ్రవాదులు ప్రస్తుతం ఓ వాహనం కోసం అన్వేషిస్తున్నారని.. అదే క్రమంలో వాహనం చోరీకి గురవడం కలకలం సృష్టిస్తోంది. దీంతో వాహనాన్ని చోరీకి పాల్పడిన వారిని పట్టుకోవడం కోసం ప్రస్తుతం అక్కడి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ( Also read: Unknown Pneumonia: చైనా పొరుగు దేశాన్ని వణికిస్తున్న కొత్త వైరస్ )

Section: 
English Title: 
Pulwama-like attack planned by terrorists in Kashmir: intelligence sources
News Source: 
Home Title: 

Pulwama like attack: మరో భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర.. రెక్కీ పూర్తి

Pulwama like attack: మరో భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర.. రెక్కీ పూర్తి
Caption: 
File Photo
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Pulwama like attack: మరో భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర.. రెక్కీ పూర్తి
Publish Later: 
No
Publish At: 
Saturday, July 11, 2020 - 15:34