Gautam Gambhir vs MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీపై అవకాశం చిక్కిన ప్రతీసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించే టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపి ఎంపీ గౌతం గంభీర్.. తాజాగా ధోనీ కెప్టేన్సీపై మరోసారి విరుచుకుపడ్డారు. టీమిండియాకు తగిన సంఖ్యలో గొప్ప ఆటగాళ్లను అందించడంలో సౌరబ్ గంగూలీలా ( Sourav Ganguly ) ఎం.ఎస్. ధోనీ విజయం సాధించలేకపోయాడని గౌతం గంభీర్ అభిప్రాయపడ్డారు. సౌరబ్ గంగూలీ కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకునే సమయానికి టీమిండియాకు విజయాన్ని అందించే ఆటగాళ్లకు కొదువలేదని... కానీ ఎం.ఎస్. ధోనీ కెప్టేన్సీ ముగిసే సమయానికి విరాట్ కోహ్లీకి ( Virat Kohli ) అండగా నిలిచే స్థాయిలో రోహిత్ శర్మ ( Rohit Sharma ), ఇప్పుడు జస్ప్రిత్ బుమ్రా ( Jasprit Bumra ) లాంటి ఆటగాళ్లు తప్ప.. ఎక్కువ ఆటగాళ్లే లేకపోయారని గంభీర్ పేర్కొన్నారు. ( Also read: వరల్డ్ కప్ నెగ్గిన తర్వాతే నా పెళ్లి: రషీద్ ఖాన్ )
యువరాజ్ సింగ్, వీరేంద్ర సేహ్వాగ్, జహీర్ ఖాన్, హర్బజన్ సింగ్ ( Yuvraj Singh, Harbhajan Singh, Zaheer Khan, Virender Sehwag ) లాంటి యువ టాలెంట్స్‌ని ప్రోత్సహించి దేశానికి అందించిన ఘనత గంగూలీ సొంతం అని ఈ సందర్భంగా గౌతం గంభీర్ వ్యాఖ్యానించారు. టీమిండియాకు నేతృత్వం వహించిన గొప్ప కెప్టేన్స్‌లోనే ఒకరిగా ధోనీని అభినందిస్తుంటారు కానీ ఈ విషయంలో గంగూలీ ఎంతో ముందుండగా.. ధోనీ మాత్రం ఎక్కడో వెనకబడిపోయాడని గంభీర్ విమర్శించారు. ( Also read: IPL 2020: ఐపిఎల్ 2020 నిర్వహణపై స్పందించిన న్యూజిలాండ్ )
Gautam Gambhir: ధోనీపై మరోసారి విరుచుకుపడిన గౌతం గంభీర్