న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ ( Coronavirus ) అన్నిరంగాలను అతలాకుతలం చేస్తూనే ఉంది. రోజురోజుకి పెరుగుతున్న కేసులు, మరణాలతో ఆర్థికరంగం, పర్యాటక రంగం, క్రీడారంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దీని కారణంగా సెప్టెంబరులో భారత్‌లో జరగాల్సిన భారత్, ఇంగ్లాండ్ క్రికెట్ సిరీస్ (Ind vs Eng series) వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబరులో భారత పర్యటనలో భాగంగా భారత్‌తో ఇంగ్లాండ్ 3 వన్డేలు, మూడు టీ-20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. Also read: ‘గంగూలీ పునాదితోనే MS Dhoniకి విజయాలు’
దీని కోసం ఇంగ్లాండ్ జట్టు సెప్టెంబర్ 16 న భారత్‌కు రావాల్సి ఉంది. అయితే కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ జట్టు భారత్‌లో పర్యటించే పరిస్థితి కనిపించడంలేదు. ఈ సిరీస్‌పై, అలాగే వచ్చే ఏడాది జరిగే టెస్ట్ సిరీస్‌పై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB), బీసీసీఐ (BCCI) మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. భారత్ - ఇంగ్లాండ్ సిరీస్ వాయిదా వేసే ముందు టీ20 ప్రపంచ కప్‌కు సంబంధించి ఐసీసీ ( ICC ) అధికారిక నిర్ణయం కోసం బీసీసీఐ వేచి చూస్తోంది. Also read: Gautam Gambhir: ధోనీపై మరోసారి విరుచుకుపడిన గౌతం గంభీర్
ఇదిలాఉంటే.. సెప్టెంబరు చివరి నుంచి నవంబర్ ప్రారంభం వరకు ఐపీఎల్ (IPL-2020) నిర్వహణకు బీసీసీఐ పరిశీలిస్తోందని, అయితే దీని వేదిక విదేశాల్లో ఉంటుందని, ఇందుకోసం యూఏఈ లేదా శ్రీలంకను ఎంచుకోవాల్సి ఉందని ఐఏఎన్ఎస్ ఇప్పటికే తన నివేదికలో పేర్కొంది. అయితే.. టీ-20 ప్రపంచ కప్‌ను వాయిదా వేసి, ఐపీఎల్ 13 వ ఎడిషన్‌కు అవకాశం కల్పించేలా కనిపిస్తోందని డైలీ మెయిల్ పేర్కొంది.
ఐపీఎల్ లేకుండా ఏడాది గడవడం అనేది ఊహించలేనిదని, దేశంలో ఐపీఎల్ నిర్వహించడం తన మొదటి ప్రాధాన్యత అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ( Sourav Ganguly ) కొద్ది రోజుల క్రితం వెల్లడించారు. ఇదంతా పరిశీలిస్తోంటే.. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న సిరీస్‌పై ఐపీఎల్ ప్రభావం కూడా ఉండకపోదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. Also read: IPL 2020: ఐపిఎల్ 2020 నిర్వహణపై స్పందించిన న్యూజిలాండ్