తిరువనంతరపురం : కరోనావైరస్ ( Coronavirus pandemic ) వ్యాప్తి నివారణకు సహకరించాల్సిందిగా ప్రభుత్వాలు చేస్తోన్న విజ్ఞప్తుల పట్ల జనం ఎక్కడైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో... అక్కడ కరోనావైరస్ మరింత విజృంభిస్తోంది. కరోనా నివారణకు ప్రభుత్వాలు సూచిస్తున్న ముఖ్యమైన మార్గదర్శకాల్లో సోషల్ డిస్టెన్సింగ్ ( Social distancing ) కూడా ఒకటి. వీలైతే శుభ కార్యాలు, రద్దిగా ఉండే కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సిందిగా చెబుతున్న ప్రభుత్వాలు.. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో శుభకార్యాలు చేసుకోవాల్సి వస్తే... భౌతిక దూరం లక్ష్యం దెబ్బతినకుండా వీలైనంత తక్కువ మందితో శుభకార్యాలు చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాయి. ఐతే, ప్రభుత్వాలు ఎంత చెప్పినా జనం మాత్రం చివరకు తమకు తోచిందే చేస్తున్నారు. దీంతో రద్దీని తలపించే శుభ కార్యాలు, వేడుకలు ( Celebrations ) కరోనావైరస్ వ్యాప్తికి కేంద్రాలుగా మారుతున్నాయి. Also read: 47 Chinese apps: చైనాకు చెందిన మరో 47 క్లోన్ యాప్స్‌పై భారత్ నిషేధం
కేరళలోనూ తాజాగా అదే జరిగింది. కాసర్గడ్ జిల్లాలో ( Kasargod district ) జరిగిన ఓ వివాహానికి హాజరైన 43 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా అంత మందిని ఆహ్వానించి శుభకార్యం చేసుకుని కరోనా వైరస్ వ్యాప్తికి కారకుడైన వధువు తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. Also read: Time capsule: రామ మందిరం కింద 2 వేల అడుగుల లోతులో టైమ్ క్యాప్సుల్
కాసర్గడ్ జిల్లాలోని చెంగలాలో జూలై 17న ఓ వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుక అనంతరం వధూవరులు ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలింది ( Bride and groom tested positive for COVID-19). దీంతో ఈ పెళ్లికి హాజరైన వాళ్లను హోమ్ క్వారంటైన్లో ఉండాల్సిందిగా సూచించిన జిల్లా కలెక్టర్.. వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తే.. సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంపద్రించాలని అన్నారు. Also read: Jackfruit benefits: పనస పండుతో ప్రయోజనాలు.. మాంసాహారానికి మంచి ప్రత్యామ్నాయం
ఐతే, పెళ్లికి హాజరైన వారిలో కొంతమందికి కరోనా లక్షణాలు ( Coronavirus symptoms ) కనిపించి పరీక్షలు చేసుకోగా.. వారిలో 43 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కాసర్గడ్ జిల్లా అధికార యంత్రాంగం.. కేరళ ఎపిడెమిక్ డిసీజెస్ ఆర్డినెన్స్ 2020 యాక్టు కింద వధువు తండ్రిపై చర్యలకు పూనుకుంది. పై అధికారుల ఆదేశాల మేరకు బడియుడుక్కా పోలీసులు వధువు తండ్రిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also read: Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు