చిన్న నిర్లక్ష్యమైనా కొన్నిసార్లు భారీ నష్టాలకు గురిచేస్తోంది. అందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇదే తరహాలో ఓ ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ మూడంతస్తుల భవనం చూస్తుండగానే సెకన్ల వ్యవధిలో కుప్పకూలిపోయింది (Building Collapsed). కర్ణాటక రాజధాని బెంగళూరులోని మేజెస్టిక్ ప్రాంతం (Building Collapse in Bengaluru)లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. GHMC: ఆస్తిపన్నుపై వడ్డీ 90శాతం తగ్గింపు
నిర్మాణం చేపట్టిన ప్రాంతానికి పక్కన ఖాళీ ప్రదేశం ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఏమాత్రం జాగ్రత్తలు పాటించకుండా.. గట్టి పునాది లేకుండా నిర్మిస్తున్న ఓ భవనం క్షణాల్లో కుప్పకూలిపోయింది. అయితే ఆ సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. భవనం కుప్పకూలిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి రికార్డులు
#WATCH Karnataka: A three-storied building behind an under construction site in Majestic area of Bengaluru collapsed yesterday; no casualties reported. pic.twitter.com/FYeiMnbrEw
— ANI (@ANI) July 28, 2020
పోకిరి లేడీ విలన్ Sheeva Rana Hot Photos వైరల్
నితిన్, షాలిని పెళ్లి వేడుక ఫొటోలు