CAG: చీఫ్‌గా జీసీ ముర్ము ప్రమాణ స్వీకారం

భారతదేశ నూతన కంప్ట్రోలర్ అండ్‌ ఆడి‌టర్‌ జన‌ర‌ల్‌ (CAG) గా గిరీష్ చంద్ర‌ ముర్ము  (Girish Chandra Murmu) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. 

Last Updated : Aug 8, 2020, 12:04 PM IST
CAG: చీఫ్‌గా జీసీ ముర్ము ప్రమాణ స్వీకారం

Murmu takes oath as CAG Chief: న్యూఢిల్లీ: భారతదేశ నూతన కంప్ట్రోలర్ అండ్‌ ఆడి‌టర్‌ జన‌ర‌ల్‌ ( CAG ) గా గిరీష్ చంద్ర‌ ముర్ము ( Girish Chandra Murmu ) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ( Ram Nath Kovind ) ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( Narendra Modi ) సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కోవిడ్-19 నిబంధనల మేరకు అతి తక్కువ మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. Also read: India: 20లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రస్తుత కాగ్ రాజీవ్ మెహెర్షి పదవీ విరమణ చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో ముర్మును నియమించారు. అయితే గిరీష్ చంద్ర‌ ముర్ము జ‌మ్మూక‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌‌గా ఉండగానే కాగ్‌గా ఆయన్ను నియమించడంతో ఆయన తన పదవికి గురువారం రాజీనామా చేశారు. అయితే ఆయన స్థానంలో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా మనోజ్ సిన్హా నియమితులయ్యారు.  Also read: Mahesh Babu: ఫ్యాన్స్‌కు సూపర్‌స్టార్ విజ్ఞప్తి

Trending News