మత విద్వేష వ్యాఖ్యలు.. మాజీ ఎమ్మెల్యేపై ఆప్ వేటు

మత విద్వేష వ్యాఖ్యలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో ఇటీవల కర్ణాటకలో జరిగిన ఘటన నిదర్శనం. దేవుళ్లపై కామెంట్లు చేసిన పార్టీ మాజీ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్‌‌పై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP suspends Jarnail Singh) వేటు వేసింది.

Last Updated : Aug 13, 2020, 11:41 AM IST
  • మత విద్వేష వ్యాఖ్యలు పోస్ట్ చేసిన మాజీ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్
  • సెక్యూలర్ పార్టీలో ఇవన్నీ తగవంటూ వేటు వేసిన ఆప్
  • పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ
మత విద్వేష వ్యాఖ్యలు.. మాజీ ఎమ్మెల్యేపై ఆప్ వేటు

ఢిల్లీ: మత విద్వేష వ్యాఖ్యలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో ఇటీవల కర్ణాటకలో జరిగిన ఘటన నిదర్శనం. ఈ నేపథ్యంలో దేవుళ్లపై కామెంట్లు చేసిన పార్టీ మాజీ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్‌‌పై ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) వేటు వేసింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు వెల్లడించింది. హిందూ దేవుళ్లను కించపరిచేలా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారన్న ఆరోపణలతో పార్టీ నేత జర్నైల్ సింగ్‌పై వేటు (AAP suspends Jarnail Singh) వేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆప్ ప్రతినిధులు తెలిపారు. Sputnik V: రష్యా వ్యాక్సిన్‌పై సీసీఎంబీ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

స్పందించిన జర్నైల్ సింగ్..
తన చిన్న కుమారుడు ఆన్‌లైన్ క్లాసులు వింటూ పొరపాటున ఏవో పోస్టులు చేశాడని మాజీ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ (Jarnail Singh) వివరణ ఇచ్చుకున్నారు. కానీ సెక్యూలర్ పార్టీ అయిన ఆప్‌లో ఇలాంటివి తగవంటూ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సిక్కు మతానికి చెందిన పెద్దలు సైతం జర్నైల్ సింగ్ పోస్టు పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. హెచ్1బీ వీసాదారులకు అమెరికా శుభవార్త

మాజీ జర్నలిస్ట్ జర్నైల్ సింగ్ గతంలో రాజౌరి గార్డెన్ ఎమ్మెల్యేగా సేవలందించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చెందిన జర్నైల్ సింగ్ 2015 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. 2017లో రాజీనామా చేసి పంజాబ్‌లో ప్రకాష్ సింగ్ బాదల్‌పై పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్, ఆప్ కలిసి పని చేయనున్నాయని ప్రచారం జరగగా ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా..
పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే... 

Trending News