The Shark: ఆ మహాసముద్రంలో కనుగొన్న ఆ సొరచేపకు..మనిషి వయస్సుకు సంబంధమా

సముద్రజీవుల్లోనే కాదు..భూమిపై కూడా  అత్యంత పురాతనమైంది..అత్యంత ఎక్కువ వయస్సు కలిగింది.  రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కూడా చూసింది ఈ సొరచేప. ప్రపంచంలోని చాలా పరిణామాల్ని పరికించింది. ఇంకా అటూ ఇటూ తిరుగుతూనే ఉంది. 393 ఏళ్ల షార్క్  చేప...ఎన్నో పరిశోధనలకు సహాయపడుతుందనేది పరిశీలకుల నమ్మకం..

Last Updated : Aug 22, 2020, 12:19 AM IST
  • భూమిపై బతికున్న అత్యంత పురాతన జీవి ఇదే
  • 1627లో పుట్టి...ఆర్కిటిక్ మహా సముద్రంలో తిరుగుతున్న గ్రీన్ ల్యాండ్ షార్క్
  • జన్యుక్రమంపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు..మనిషి వయస్సు పెంచేందుకు దోహదపడుతుందని నమ్మకం
The Shark: ఆ మహాసముద్రంలో కనుగొన్న ఆ సొరచేపకు..మనిషి వయస్సుకు సంబంధమా

సముద్రజీవుల్లోనే కాదు..భూమిపై కూడా  అత్యంత పురాతనమైంది..అత్యంత ఎక్కువ వయస్సు కలిగింది.  రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కూడా చూసింది ఈ సొరచేప. ప్రపంచంలోని చాలా పరిణామాల్ని పరికించింది. ఇంకా అటూ ఇటూ తిరుగుతూనే ఉంది. 393 ఏళ్ల షార్క్  చేప. ఆర్కిటిక్ మహా సముద్రం ( Arctic ocean ) లో కనుగొన్న ఈ సొరచేప...ఎన్నో పరిశోధనలకు సహాయపడుతుందనేది పరిశీలకుల నమ్మకం..

సాధారణంగా గ్రీన్ ల్యాండ్ సొరచేపలు అంటే గ్రీన్ ల్యాండ్ షార్క్ లు ( greenland shark ) 4 వందల ఏళ్ల పాటు ( lives for 4 hundred years ) బతుకుతాయని పరిశీలకులు చెప్పడమే గానీ ఎప్పుడూ అంత వయస్సున్న షార్క్ తారసపడలేదు. అటువంటిది ఆర్కిటిక్ మహా సముద్రంలో 393 ఏళ్ల వయస్సున్న గ్రీన్ ల్యాండ్ సొరచేపను ( 393 years Green land shark detected ) పరిశోధకులు గుర్తించారు. 1627 వ సంవత్సరంలో పుట్టిన ఈ గ్రీన్ ల్యాండ్ సొరచేప సహాయంతో చాలా పరిశోధనలు చేయవచ్చని పరిశీలకులు నమ్ముతున్నారు.  మనిషి జీవిత కాలాన్ని ఎక్కువ కాలంపాటు ఎలా పొడిగించవచ్చనేది తెలుసుకునేందుకు ఆధారాలు ఈ సొరచేపలో లభించవచ్చని జన్యు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటన్ ( Britain ) లోని కోస్తా తీరంలో కన్పించే ఈ సొరచేపను ఆర్కిటిక్ యూనివర్శిటీ ఆఫ్ నార్వే ( Arctic university of norway ) శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారిప్పుడు. Also read: Nuclear War: భారత్‌పై అణుబాంబులతో దాడి: పాక్ మంత్రి

గ్రీన్ ల్యాండ్ సొరచేపలకుండే ( Shark ) అసాధారణ జీవితకాలానికి కారణమేంటి..అందులో ఉండే జన్యువులేంటనేది గుర్తించాల్సి ఉంటుంది. ఇది గుర్తించగలిగి వాటిని వేరు చేయగలిగితే సక్సెస్ అయినట్టే. దీనిద్వారా మనిషి వయస్సును పొడిగించుకునే వీలుందని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం గ్రీన్ ల్యాండ్ సొరచేపల న్యూక్లియర్ జన్యుక్రమంపై పరిశోధన జరుగుతోందని..ఇతర జంతువుల కంటే ఎక్కువ కాలం ఎలా జీవించగలుగుతుందనేది పరిశోధనల్లో వెల్లడవుతుందని ఆర్కిటిక్ యూనివర్శిటీ ప్రొఫెసర్ కిమ్ ప్రెబెల్ చెబుతున్నారు. 

అంతుచిక్కని జాతుల బయాలజీని గుర్తించి అర్దం చేసుకుంటే చాలా దోహదపడుతుంది. ఇప్పటివరకూ గ్రీన్ ల్యాండ్ షార్క్ జీవశాస్త్రం, జన్యుశాస్త్రం గురించి చాలా తక్కువ సమాచారం ప్రపంచానికి తెలుసని ప్రొఫెసర్ కిమ్ ప్రెబెల్ తెలిపారు. Also read: Izrael: మైనర్ పై దారుణం..30 మంది గ్యాంగ్ రేప్

Trending News