ROFR pattas to be distributed to tribals on October 2nd in AP: అమరావతి: ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అడవుల్లో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులందరికీ భూ హక్కు పట్టాలు ఆగస్టు 9న ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించగా.. కరోనా (Coronavirus) వ్యాప్తి కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబరు 2 గాంధీ జయంతి రోజున రాష్ట్రంలోని 35 షెడ్యూల్డ్ మండలాల్లో ఆర్ఓఎఫ్ఆర్ (ROFR) పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం సీఎం తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. Also read: Flash news: తెలంగాణ అసెంబ్లీ ఉద్యోగికి కరోనా
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ గాంధీ జయంతి రోజున పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు పట్టాలను అందజేసేందుకు సర్వం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సరిహద్దులను గుర్తించడం, సరిహద్దు రాళ్లను వేయడం, లబ్ధిదారులకు కేటాయించిన భూమి దగ్గర.. వారి పోటోలు తీయాలని సూచించారు. దీంతోపాటు.. రికార్డుల్లో వాటిని నమోదు చేయడం, వెబ్ ల్యాండ్, ఆర్ఓఎఫ్ఆర్ డేటాబేస్‌లో ఈ వివరాలను నమోదు చేయడం వంటివి ఈలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. Also read : Bigg Boss Telugu 4 contestant Gangavva: గంగవ్వ ఎవలు, బిగ్ బాస్‌కి ఎట్లొచ్చింది ?