గుజరాత్ సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ తర్జనభర్జన

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గుజరాత్ సీఎం విషయంలో  తెగ హైరానా పడిపోతోంది.

Last Updated : Dec 19, 2017, 03:44 PM IST
గుజరాత్ సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ తర్జనభర్జన

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గుజరాత్ సీఎం విషయంలో  తెగ హైరానా పడిపోతోంది. పార్టీ నాయకత్వం ప్రస్తుతం విజయ్ రూపానీ పేరును కొనసాగిస్తూనే.. సొంత రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ 'వికాస్ యాత్ర' (అభివృద్ధి విధానం)ను ముందుకు తీసుకెళ్లడానికి కొత్త ముఖానికి అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నారు.

గురువారం సాయంత్రం తుది సీట్లు ప్రకటించిన వెంటనే బీజేపీ సీనియర్ నాయకులు అరుణ్ జైట్లీ, సరోజ్ పాండేలను గుజరాత్ ముఖ్యమంత్రి ఎంపిక కోసం పార్టీ పరిశీలకులుగా నియమించారు. ఈ విషయం గురించి ఒకటిరెండు రోజుల్లో ప్రకటన రావచ్చు.  

విజయ్ రూపానీ సీఎంగా  కొనసాగుతారా? 

ఎన్నికల ప్రచారం సందర్భంగా, పార్టీ చీఫ్ అమిత్ షా గుజరాత్ ఎన్నికల్లో విజయ్ రూపానీనే హైలెట్ చేస్తూ వచ్చారు. రూపానీ రాజ్కోట్ వెస్ట్ సీటు నుంచి 25,000 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. అయితే, పార్టీ సీఎం అభ్యర్థిగా మరొకొందరి పేర్లను పరిశీ లిస్తోందని ఊహాగానాలు ఊపందుకున్నాయి.  

 గుజరాత్ సీఎంగా ఆనందిబెన్ పటేల్ పదవికి రాజీనామా చేశాక.. అనూహ్యంగా విజయ్ రూపానీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ గతంతో పోలిస్తే స్వల్ప మెజారిటీతో గట్టెక్కింది. వారు అనుకున్న మెజారిటీ రాలేదు. గుజరాత్ లో 182 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. బీజేపీకి 99 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ కి 80 సీట్లు వచ్చాయి. ఇతరులు మూడు సీట్లు గెలుచుకున్నారు. 

గుజరాత్ ముఖ్యమంత్రి రేసులో ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లు: విజయ్ రూపానీ, ఆర్సీ ఫాల్దు, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, మనుషుఖ్ మండవియా, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా.

ముఖ్యమంత్రి నరేంద్రమోదీకి  'బ్లూ- ఐ బాయ్' గా భావించే రోడ్డు రవాణా, హైవే, షిప్పింగ్ మంత్రి మనుషుఖ్ ఎల్ మాండవియా ముఖ్యమంత్రిగా రేసులో రెండో స్థానంలో ఉన్నారు. ఉద్యోగాలలో, విద్యలో రిజర్వేషన్లు కోరుతున్న సమాజాన్ని శాంతిపజేయాలంటే అందుకు సరైన పటిదార్ నాయకుడు మనుషుఖ్ మండవియా సీఎం అయితే బాగుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. 
 
గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్న మరో వ్యక్తి  కేంద్ర సమాచార, ప్రసార,  టెక్స్టైల్స్ మంత్రి స్మృతి ఇరానీ. ఈ ఏడాది ఆగస్టులో గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఇరానీ రాష్ట్రంలో పార్టీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఆమె  "నేను ఖచ్చితంగా పోటీదారు కాదు" అని చెప్పారు.

ప్రస్తుత కర్నాటక గవర్నర్, గుజరాత్ అసెంబ్లీ మాజీ స్పీకర్ వాజూభాయ్ వాలా కూడా సీఎం రేసులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. గుజరాత్ రాజకీయాల్లో ప్రముఖుడైన వాలా, గతంలో ఉపాధి, కార్మిక, ఆర్థిక లాంటి ప్రధాన విభాగాలకు మంత్రిగా పనిచేశారు. 

ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ కూడా పోటీదారుగా ఉన్నారు. గత ఏడాది పటేల్ ను అనందిబెన్ పటేల్ స్థానంలో ఉంచాలనుకున్నారు. అయితే, చివరి క్షణంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా రూపానీ ఖరారు కావడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. 

కొన్ని మీడియా నివేదికలు కూడా అమిత్ షా సీఎంగా బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించుకున్నారని  తెలిపారు. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, 2019 సాధారణ ఎన్నికలు జరుగుతున్నందున అమిత్ షాను 'మాస్టర్ వ్యూహకర్త' అభివర్ణిస్తూ ఆయన  ఢిల్లీ వదిలి గుజరాత్ కు రారు అని తెలిపారు.

Trending News