Prashant Bhushan moves to SC Contempt of court case: ఢిల్లీ: ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ( Prashant Bhushan ) న్యాయవ్యవస్థపై పలు ఆరోపణలు చేసి కోర్టు ధిక్కరణకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన సర్వోన్నత న్యాయస్థానం (supreme court) ఒక్క రూపాయి జరిమానా (Prashant Bhushan Fined For RS 1) విధించింది. ఒకవేళ ప్రశాంత్ భూషణ్ ఈ ఒక్క రూపాయి జరిమానాను సెప్టెంబరు 15లోపు చెల్లించకపోతే.. ఆయన ప్రాక్టీస్‌పై మూడేళ్ల నిషేధంతో పాటు మూడు నెలలపాటు జైలుశిక్షను అనుభవించాల్సి ఉంటుందని జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం ఆగస్టు 31న తీర్పును సైతం ప్రకటించింది. అయితే గడువు ముగుస్తున్న క్రమంలో.. ప్రశాంత్ భూషణ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. Also read: Kangana Ranaut: ‘నేనూ డ్రగ్స్‌కు బానిసయ్యా’.. కంగనా పాత వీడియో వైరల్
అయితే.. కోర్టు ధిక్కరణ తీర్పుపై ప్రశాంత్ భూషణ్ మళ్లీ సర్వోన్నత న్యాయస్థానం తలుపుతట్టారు. ఈ తీర్పుపై తిరిగి సర్వోన్నత న్యాయస్థానానికి అప్పీలు చేసుకునే హక్కు తనకు ఉందని.. ఈ కేసును ధర్మాసనంలోని మరింత పెద్ద బెంచ్ వినాల్సిందిగా ఆయన విన్నవిస్తూ శనివారం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే తీర్పు గడువు ముగుస్తున్న క్రమంలోనే.. ప్రశాంత్ భూషణ్ మళ్లీ సర్వోన్నత న్యాయస్థానానికి అప్పీలు చేసుకోవడంపై.. సోమవారం ఎలాంటి తీర్పు వెలువడుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. Also read: US Open 2020: ఉమెన్స్ సింగిల్స్ ఛాంపియన్‌గా నవోమి ఒసాకా