Nageshwar: మళ్లీ మండలి బరిలో ప్రొఫెసర్ నాగేశ్వర్

ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కే. నాగేశ్వర్ (Professor K Nageswar) కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోసారి తెలంగాణ మండలి ( MLC elections) ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

Last Updated : Oct 1, 2020, 11:30 AM IST
Nageshwar: మళ్లీ మండలి బరిలో ప్రొఫెసర్ నాగేశ్వర్

Telangana MLC graduate elections: హైదరాబాద్: ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కే. నాగేశ్వర్ (Professor K Nageswar) కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోసారి తెలంగాణ మండలి ( MLC elections) ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. రెండు దఫాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీగా సేవలందించిన కే.నాగేశ్వర్‌.. మళ్లీ హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ( MLC graduate elections) నియోజకవర్గం నుంచి మండలికి పోటీ చేయనున్నట్లు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా బుధవారం వెల్లడించారు. ఇప్పటికే తనకు అనేక ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయని నాగేశ్వర్ తెలిపారు. అయితే 2021 ఫిబ్రవరి లేదా మార్చి నెలలో మండలి పట్టభద్రల ఎన్నికలు జరగనున్నాయి. అయితే పట్టభద్రుల ఎన్నికల్లో తాను పోటీ చేసే అంశంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, పలు వార్తా ఛానెళ్లల్లో చర్చ జరుగుతుందని.. అయితే దానికి చెక్ పెట్టేందుకు అధికారికంగా ప్రకటన చేస్తున్నట్లు కే. నాగేశ్వర్ వెల్లడించారు. అయితే తాను అందరి వాడినని.. సమస్యలపై పోరాడుతానని.. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తాను కానీ.. ఒక్క రూపాయి కూడా ఇవ్వనని స్పష్టంచేశారు. తనను అభ్యర్ధిగా ఖరారు చేయాలని ఏ పార్టీని, రాజకీయ నాయకులను కానీ కలిసి అభ్యర్ధించలేదని నాగేశ్వర్‌ తెలిపారు. అయితే ఇటీవల కాలలంలో అసెంబ్లీ, మండలిలో ప్రజా సమస్యలపై చర్చ జరగకపోవడం శోచనీయమన్నారు.  Also read: Balrampur Gang Rape: యూపీలో మరో హత్రాస్.. మృగాళ్ల వేటకు మరో యువతి బలి

ఇదిలాఉంటే.. ప్రొఫెసర్ కే. నాగేశ్వర్‌కు మొదటి నుంచి వామపక్ష భావజాలం ఉన్నప్పటికీ.. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాల నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే అంతకుముందు 2007-2009లో హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మండలికి పోటీ చేసి గెలుపొంది 2014వరకు సేవలందించారు. మళ్లీ తాజాగా అదే నియోజకవర్గం నుంచి ఆయన మండలికి పోటీచేస్తున్నారు. Also read: Hathras Gang Rape: మృగాళ్ల వేటకు యువతి బలి.. బలవంతంగా మృతదేహం దహనం

Trending News