Mass Execution: ఈ దేశంలో ఒక్కరోజే 21 మందిని ఉరితీశారు

21 Persons Hanged In a Day | ఉగ్రవాద చట్టాలను ఉల్లఘించారు అనే కారణం చూపుతూ ఇరాక్ దేశంలో సోమవారం రోజు ఒక్క రోజే 21 మందిని ఉరి తీశారు.

Last Updated : Nov 17, 2020, 06:18 PM IST
    1. ఉగ్రవాద చట్టాలను ఉల్లఘించారు అనే కారణం చూపుతూ ఇరాక్ దేశంలో సోమవారం రోజు ఒక్క రోజే 21 మందిని ఉరి తీశారు.
    2. అంత మందిని ఉరితీయడం ఈ మధ్యకాలంలో ఏ దేశంలో జరగలేదు.
    3. దీంతో మానవ హక్కుల సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి.
Mass Execution: ఈ దేశంలో ఒక్కరోజే 21 మందిని ఉరితీశారు

Mass Execution In Iraq | ఉగ్రవాద చట్టాలను ఉల్లఘించారు అనే కారణం చూపుతూ ఇరాక్ దేశంలో సోమవారం రోజు ఒక్క రోజే 21 మందిని ఉరి తీశారు. అంత మందిని ఉరితీయడం ఈ మధ్యకాలంలో ఏ దేశంలో జరగలేదు. దీంతో మానవ హక్కుల సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇరాక్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ఇరాక్ లోని నసీరియా జైలులో వీరిని ఉరితీశారు.

Also Read | ZH Fact Check: డిసెంబర్ 1న దేశంలో మరోసారి లాక్‌డౌన్‌ పెట్టనున్నారా?  నిజం తెలుసుకోండి!

 కారణం తెలియదు
ఇరాక్ లోని ( Iraq ) నసీరియా జైలులో ఒక్క రోజులోనే 21 మందికి ఉరిశిక్ష విధించారు. 2005 ఉగ్రవాద నిరోధక చట్టానికి అనుగుణంగా వీరికి మరణ శిక్ష విధించినా వారు చేసిన తప్పేంటి అనేది ప్రభుత్వం వెల్లడించలేదు. ఉరికి ముందు ఈ 21 మందిని ఒకే జైలులో ఉంచారు. సద్దాం హుస్సేన్ కాలంలో వందలాది మంది అధికారులను, మాజీ అధికారులను ఇరాక్ లో ఉరి తీసేవారు. ఆ దేశంలో ఉరికి ప్రభుత్వం చట్టబద్దత కల్పించింది.

Also Read | Tips To Avoid Air Pollution: కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేసి 

ఒకే జైలులో..
క్వార్ ప్రావిన్సులోని నసీరియా జైలులో ఉరిశిక్షను అమలు చేశారు. ఉరిని అమలు చేసే ఏకైక జైలుగా ఆ చెరశాల అపవాదు మూటగట్టుకుంది. ఇదే జైలులో సద్దాం హుస్సేయిన్ ( Saddam Hussain ) మాజీ  అధికారులను ఉరితీసేవారు.

అధ్యక్షుడి అనుమతి తప్పనిసరి
ఇరాక్ లో ఉరిశిక్ష సాధారణమే. దీనిపై మానవ హక్కుల సంఘాలు ప్రభుత్వానికి ఎన్ని సార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం ఉరిశిక్షను రద్దు చేయలేదు. అయితే ఆ దేశంలో ఉరిశిక్ష విధించాలి అంటే మాత్రం అధ్యక్షుడి అనుమతి అవసరం. 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News