Ram Charan's next movie: డ్యాషింగ్ డైరెక్టర్‌తో రాంచరణ్ సినిమా ?

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీలో రాంచరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర పోషిస్తుండటంతో మెగా అభిమానుల్లో ఆ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికితోడు రాజమౌళి దర్శకత్వం, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తుండటం వంటి ఎన్నో అంశాలు ఉన్నాయి.

Last Updated : Nov 18, 2020, 12:15 AM IST
Ram Charan's next movie: డ్యాషింగ్ డైరెక్టర్‌తో రాంచరణ్ సినిమా ?

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీలో రాంచరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర పోషిస్తుండటంతో మెగా అభిమానుల్లో ఆ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికితోడు రాజమౌళి దర్శకత్వం, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తుండటం వంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. చెర్రీ ఆర్ఆర్ఆర్ మూవీకి సైన్ చేసి ఇన్ని రోజులు అవుతున్నా.. ఇప్పటివరకు ఆ తర్వాత మరే ఇతర సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. పలు దర్శకుల కథలు విన్నట్టు టాక్ వినిపించినప్పటికీ.. అవ్వేవి ఫైనల్ కాలేదు. 

తాజాగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్న టాక్ ప్రకారం రాంచరణ్ ఈసారి డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ( Director Puri Jagannath ) దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. రాంచరణ్ హీరోగా చేసిన తొలి చిత్రం చిరుత మూవీని డైరెక్ట్ చేసింది పూరి జగన్నాథ్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఒకవేళ పూరి జగన్నాథ్ - రాంచరణ్ ( Ram Charan ) కాంబోలో సినిమా ఓకే అయితే, పదిహేనేళ్ల తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ సెట్ అవడం మళ్లీ ఇదే తొలిసారి అవుతుంది. 

Also read : Bigg Boss 4 Telugu: ఈ వారం నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య తారాస్థాయికి చేరిన మాటల యుద్ధం !

ఇక పూరి జగన్నాథ్ విషయానికొస్తే.. పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ( Vijay Deverakonda ) ఫైటర్ మూవీతో బిజీగా ఉన్నాడు. ప్యాన్ ఇండియా చిత్రంగా రానున్న ఫైటర్ మూవీలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ నటి అనన్య పాండే జంటగా నటిస్తోంది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ తొలిసారి బాలీవుడ్‌కి పరిచయం అవుతుండగా.. అనన్యా పాండే టాలీవుడ్‌కి పరిచయం అవుతోంది. కరణ్ జోహర్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

Also read : Jr Ntr with Atlee: తమిళ దర్శకుడితో తారక్ మూవీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Trending News