AP: వైఎస్ జగన్ సర్కార్ చారిత్రక నిర్ణయం.. నెరవేరిన వారి దశాబ్దాల కల

AP ST Commission: ఎందరో ముఖ్యమంత్రులు మారినా ప్రయోజనం లేకపోయింది. దశాబ్దాల తరబడి ఉన్న గిరిజనుల డిమాండ్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెరవేర్చింది. తాజాగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు ఏపీలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు కానుంది.

Last Updated : Dec 28, 2020, 06:43 PM IST
  • దశాబ్దాల తరబడి ఉన్న గిరిజనుల డిమాండ్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
  • ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్
  • ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో చారిత్రక నిర్ణయం
AP: వైఎస్ జగన్ సర్కార్ చారిత్రక నిర్ణయం.. నెరవేరిన వారి దశాబ్దాల కల

AP ST Commission: దశాబ్దాల తరబడి ఉన్న గిరిజనుల డిమాండ్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెరవేర్చింది. ఎందరో ముఖ్యమంత్రులు మారినా ప్రయోజనం లేకపోయింది. తాజాగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు ఏపీలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు కానుంది. పరిపాలనలో ఎన్నో నూతన విధానాలు తీసుకొచ్చిన వైఎస్ జగన్ తాజాగా ఎస్టీలకు శుభవార్త అందించారు.

ఏపీలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించడంతో ప్రత్యేక ఏపీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం నాడు ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. రాష్ట్రంలో ఇకనుంచి కొత్త విధానాలు అమలులోకి రానున్నాయి.

Also Read: Secured Credit Card: మీతో సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ ఉందా? ఇవి ఎవరికి ఇస్తారో తెలుసా!

ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయిన అనంతరం ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి మాట్లాడారు. ఏపీలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ కోసం గిరిజనులం ఎంతగానో పోరాడామన్నారు. చివరికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) తమకు ఇచ్చిన నెరవేర్చారని పేర్కొన్నారు. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు చట్టాలపై అవగాహన లేకపోవడంతో ఎక్కువశాతం అన్యాయానికి గురయ్యేవారని వాపోయారు.

Also Read: Cold Moon 2020 Date And Timings: అరుదైన ఫుల్ మూన్ 2020.. కనువిందు చేయనున్న చందమామ

గిరిజనుల హక్కులు కాపాడేందుకు, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారని వైఎస్సార్‌సీపీ అధినేతను కొనియాడారు. ఏపీలోని గిరిజనులు సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉన్నామని మంత్రి పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. ఎస్టీ కమిషన్ ఏర్పాటుతో రాష్ట్ర గిరిజన సంక్షేమంలో సువర్ణాధ్యాయం మొదలవుతుందన్నారు. 

Also Read: CLAT 2021 Notification: క్లాట్ 2021 నోటిఫికేషన్ వచ్చేసింది.. పూర్తి వివరాలు ఇవే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News