Fitment: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు చాలాకాలంగా పీఆర్సీ ప్రకటనపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫిట్‌మెంట్ ఎంత ఇస్తుందనేది ఇంకా తెలియలేదు. ఎప్పుడనేది తెలియదు. ఇప్పుడా విషయం దాదాపుగా ఖరారైంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ( Telangana Government ) ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ( Cm kcr ) త్వరలోనే గుడ్‌న్యూస్ చెప్పనున్నారు. చాలాకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిట్‌మెంట్ ను ప్రకటించనున్నారు. ఫిట్‌మెంట్ ఏ మేరకు చెల్లించనున్నారో దాదాపుగా నిర్ణయమైంది. వాస్తవానికి ఉద్యోగులు చాలాకాలం నుంచి పీఆర్సీ ప్రకటన కోసం వేచి చూస్తున్నారు. అయితే ఎప్పుడు చేస్తుందో తెలియక..ఎంత ఇస్తుందో తెలియక ఉద్యోగులు ఆందోళనగా ఉన్నారు.
కనీసం 30 శాతం ఫిట్‌మెంట్ ( Fitment ) చెల్లించేందుకు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. కరోనా నేపధ్యంలో ఏర్పడిన ఆర్ధిక పరిస్థితుల నేపధ్యంలో అంతకంటే ఎక్కువ ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం భావన. అందుకే ఉద్యోగ సంఘాలతో చర్చించకుండానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిట్‌మెంట్ ప్రకటించే అవకాాశాలున్నాయి.సంక్రాంతి ( Sankranti ) పండుగ తరువాత పీఆర్సీ ( PRC )పై ప్రభుత్వం జీవో జారీ చేయనుందని సమాచారం. ముందే ఉద్యోగ సంఘాలతో చర్చిస్తే ఎటూ తేలదని..అందుకే ఫిట్‌మెంట్ తరువాత బెనిఫిట్స్ అంశాలపై ముఖ్యమంత్రి సమావేశం కావచ్చని తెలుస్తోంది.
Also read: Air India: హైదరాబాద్ నుంచి అమెరికాకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ ప్రారంభం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook