Bombay High court Judgement: వివాదాస్పద తీర్పుపై రంగంలో దిగిన ఉద్ధవ్ థాకరే, స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలుకు నిర్ణయం

Bombay High court Judgement:  బోంబే హైకోర్టు వివాదాస్పద తీర్పుపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. జస్టిస్ పుష్ప ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం రంగంలో దిగింది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేయనుంది. 

Last Updated : Jan 30, 2021, 06:06 PM IST
  • జస్టిస్ పుష్ప వివాదాస్పద తీర్పుపై రంగంలో దిగిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే
  • సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలుకు ఆదేశాలు
  • ఇప్పటికే జస్టిస్ పుష్ప తీర్పుపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే
Bombay High court Judgement: వివాదాస్పద తీర్పుపై రంగంలో దిగిన ఉద్ధవ్ థాకరే, స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలుకు నిర్ణయం

Bombay High court Judgement:  బోంబే హైకోర్టు వివాదాస్పద తీర్పుపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. జస్టిస్ పుష్ప ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం రంగంలో దిగింది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేయనుంది. 

బోంబై హైకోర్టు ( Bombay High court ) నాగపూర్ బెంచ్ జస్టిస్ పుష్ప ఇచ్చిన తీర్పు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. వస్త్రాలపై నుంచి బాలిక ఛాతి భాగంలో తాకడం నేరం కాదని..స్కిన్ టు స్కిన్ టచ్ లేదు కాబట్టి..పోక్సో చట్టం ప్రకారం లైంగిక దాడిగా పరిగణించలేమంటూ జస్టిస్ పుష్ప ( Justice Pushpa ) తీర్పిచ్చారు. ఈ తీర్పుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ఇప్పటికే ఈ తీర్పును సవాలు చేస్తూ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ( Supreme court ) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ( Justice SA Bobde ) ..ఆ తీర్పుపై స్టే విధించారు. తుది విచారణ ముగిసేవరకూ నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటించారు. జస్టిస్ పుష్ప ఇచ్చిన తీర్పు ఆందోళనకరంగా ఉందని..మరోసారి సమీక్ష చేయాల్సిన అవసరముందని కేకే వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. 

మరోవైపు బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ( Maharashtra Government ) స్పందించాలని.. పలువురు హైకోర్టు న్యాయవాదులు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ( Uddhav thackeray ) కు లేఖ రాశారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు..పోక్సో అంటే లైంగిక పరమైన దాడుల్నించి చిన్నారుల రక్షణ చట్టాన్ని నీరుగార్చేవిధంగా ఉందని ఆ న్యాయవాదులు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే..న్యాయనిపుణులతో చర్చించారు. స్పెషల్ లీవ్ పిటీషన్ ( Special leave petition ) దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు.

Also read: Budget 2021 Live Updates: రాష్ట్రపతి Ram Nath Kovind బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x