COVID-19 vaccine jab: ఇక పోలీస్, మున్సిపల్ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్

Police and Municipal staff to get COVID-19 vaccine: హైదరాబాద్‌: రేపటి నుంచి పోలీస్, మున్సిపల్ సిబ్బందికి కొవిడ్-19 వ్యాక్సిన్ ఇస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. కరోనావైరస్ మహమ్మారిని తరిమికొట్టేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సిన్‌ వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రి ఈటల తెలిపారు.

Last Updated : Feb 5, 2021, 10:44 PM IST

Coronavirus vaccine రెండో దశ పంపిణీలో భాగంగా మున్సిపల్‌, పోలీసు, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖలకు చెందిన ఉద్యోగులకి కొవిడ్ వ్యాక్సిన్‌ వేయనున్నట్టు మంత్రి ఈటల పేర్కొన్నారు. కేంద్రం సూచనలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ వ్యాక్సినేషన్‌ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పుకొచ్చారు. 

Also read : Pfizer COVID-19 vaccine: కొవిడ్-19 వ్యాక్సిన్ ఎమర్జెన్సీ యూజ్‌పై ఫైజర్ కీలక నిర్ణయం

అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామని చెప్పిన మంత్రి Etela Rajender .. నిమ్స్‌ ఆస్పత్రిలో 500 ఐసీయూ, వెంటిలేటర్‌ బెడ్స్‌, గాంధీ ఆసుపత్రిలో Organ transplantation చికిత్స అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News