Election commissioner: ఎన్నికల కమీషనర్లుగా ఎవరిని నియమించాలి, కీలకంగా మారిన సుప్రీంకోర్టు ఆదేశాలు

Election commissioner: ఎన్నికల కమీషనర్లుగా ఎవర్ని నియమించాలి, ఎవర్ని నియమించకూడదనే విషయం మరోసారి చర్చకొచ్చింది. దేశ సర్వోన్నత న్యాయస్థానంపై దీనిపై స్పష్టత ఇచ్చింది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 13, 2021, 08:32 AM IST
  • ఎన్నికల కమీషనర్‌గా ప్రభుత్వ ఉద్యోాగుల్ని నియమించవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎన్నికల కమీషనర్‌గా నియమించడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే
  • గోవా కేసు విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Election commissioner: ఎన్నికల కమీషనర్లుగా ఎవరిని నియమించాలి, కీలకంగా మారిన సుప్రీంకోర్టు ఆదేశాలు

Election commissioner: ఎన్నికల కమీషనర్లుగా ఎవర్ని నియమించాలి, ఎవర్ని నియమించకూడదనే విషయం మరోసారి చర్చకొచ్చింది. దేశ సర్వోన్నత న్యాయస్థానంపై దీనిపై స్పష్టత ఇచ్చింది. 

ఎన్నికల కమీషన్ (Election commission)అనేది స్వతంత్ర వ్వస్థ అయినప్పటికీ కమీషనర్‌గా ఉన్న వ్యక్తి ఏదో ఒక రాజకీయ పార్టీకు అనుకూలంగా ఉండే పరిస్థితులు సాధారణంగా చూస్తున్నాం. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వానికి , ఎన్నికల కమీషనర్‌కు మధ్య వివాదం తలెత్తుతోంది. లేదా ప్రతిపక్షాలకు ఎన్నికల కమీషనర్‌కు మధ్య ఘర్షణ రాజుకుంటోంది. ఈ నేపధ్యంలో ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న అంశం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టు (Supreme court) చేసిన వ్యాఖ్యల కారణంగా చర్చ ప్రారంభమైంది.

ఎన్నికల కమీషనర్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ..ప్రభుత్వ ఉద్యోగుల్ని నియమించవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా అదనపు బాధ్యతల్ని ఓ ప్రభుత్వ ఉద్యోగికి అప్పగించడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని సుప్రీంకోర్టు తెలిపింది. మార్‌గోవా, మాపుసా, మార్ముగోవా, సంగెం, క్వీపెం మున్సిపల్ ఎన్నికల్లో గోవా కమీషనర్(Goa state election commissioner) ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాల్ని సవాలు చేస్తూ గోవా ప్రభుత్వం (Goa government) దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్, జస్టిస్ బి ఆర్ గవాయి, జస్టిస్ హృషికేష్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. మహిళలకు నిబంధనల ప్రకారం వార్డుల్ని కేటాయించకపోవడంతో 5 మున్సిపాల్టీల్లో ఎన్నికలు నిర్వహించవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుల హైకోర్టు(Goa High court) ఆదేశాల్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. అదే సమయంలో సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. 

ఎన్నికల కమీషన్ స్వతంత్రతను రాజీ పర్చలేమని..ఎన్నికల కమీషనర్లు స్వతంత్ర వ్యక్తులుగా ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. ప్రభుత్వంలో పదవిలో ఉన్న వ్యక్తిని ఏ రాష్ట్రాలు కూడా ఎన్నికల కమీషనర్‌గా నియమించలేవని పేర్కొంది. ప్రభుత్వంలో పనిచేస్తున్న వ్యక్తి గోవాలో ఎన్నికల కమీషనర్‌గా బాధ్యతలు నిర్వహించడం విచారించే అంశమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. గోవా పరిస్థితి అలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వానికి, ఎన్నికల కమీషనర్‌కు నిత్యం ఘర్షణ వాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిని గత ప్రభుత్వం నేరుగా ఎన్నికల కమీషనర్‌గా నియమించింది. ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్(NImmagadda Ramesh kumar) నియామకం  విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు వర్తించే పరిస్థితి ఉంది. 

Also read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు శాలరీని ఈ లెక్కలతో అంచనా వేసుకుంటున్నారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News