Telangana COVID-19 Positive Cases: తెలంగాణలో గత కొన్ని రోజులుగా కోవిడ్19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో నిన్నటితో పోల్చితే తెలంగాణలో కరోనా కేసులు పెరిగాయి. తెలంగాణలో తాజాగా 463 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,205కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
తెలంగాణలో సోమవారం రాత్రి 8 గంటల వరకు 42,461 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. అందులో 463 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 7 వేల 2 వందల అయిదుకు చేరింది. అదే సమయంలో కరోనాతో పోరాడుతూ నిన్న మరో నలుగురు వ్యక్తులు మరణించారు. తాజా మరణాలతో కలిపితే తెలంగాణ(Telangana)లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,694కి చేరింది.
Also Read: Gold Price Today, 30 March 2021: బులియన్ మార్కెట్‌లో దిగొచ్చిన బంగారం ధరలు, వెండి ధరలు పైపైకి
గత కొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కన్నా రెట్టింపు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజల్లోనూ కరోనా భయాందోళన పెరిగింది. సోమవారం నాడు ఒక్కరోజు 364 మంది చికిత్స అనంతరం కోవిడ్-19 బారి నుంచి కోలుకున్నారు. తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,00,833 మంది కరోనా మహమ్మారిని జయించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి తప్ప, తగ్గడం లేదు. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులలో 145 జీహెచ్ఎంసీ(GHMC)లోనే నమోదు కావడంతో హైదరాబాద్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణలో కరోనా సెకండ్ సేవ్ కారణంగా హాస్టళ్లు, మెస్‌లు సైతం మూసివేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,678 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో 1,723 మంది చికిత్స పొందుతున్నారు.
Also Read: Pawan Kalyan: వకీల్ సాబ్ మూవీ ట్రైలర్ రిలీజ్, ఫ్యాన్స్ మధ్య తోపులాట, పగిలిన అద్దాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook