Oxygen on Wheels: కరోనా మహమ్మారి నేపధ్యంలో అత్యవసరం కోసం ఏపీ మరో వినూత్న పథకం ప్రారంభమైంది. అదే ఆక్సిజన్ ఆన్ వీల్స్. సంక్షిప్తంగా జగనన్న ప్రాణవాయువు రథచక్రాలు.
కరోనా మహమ్మారి (Corona Pandemic) విజృంభిస్తోంది. దేశంలో చాలా కేసుల సంఖ్య పెరిగే కొద్దీ బెడ్స్, ఆక్సిజన్, అత్యవసర మందుల కొరత తీవ్రమవుతోంది. ముఖ్యంగా ఆక్సిజన్ (Oxygen Shortage) లభించక, ఆక్సిజన్ బెడ్స్ లేక రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఏపీలో మరో వినూత్న పథకం ప్రారంభమైంది. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆలోచనకు ప్రతిరూపం ఈ వినూత్న పథకం. ఈ తరహా ప్రయోగం ప్రస్తుతం దేశంలో ఎక్కడా లేదు.
తనకు కలిగిన ఆలోచనను వెంటనే కార్యాచరణలో పెట్టి ఆర్టీసీ అధికారులతో మాట్లాడి..వెన్నెల బస్సుల్ని సమకూర్చుకున్నారు. అందుకే రాజమండ్రి వేదికగా ఈ ఫథకాన్ని ఇక్కడే ప్రారంభించారు. జగనన్న ప్రాణవాయువు రథ చక్రాలు పేరుతో అధునాత బస్సును ప్రవేశపెట్టారు. ఏపీలోనే మొట్టమొదటిసారిగా కోవిడ్ బాధితులకు బస్సులో వైద్యమందించే విధానమిది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆక్సిజన్ ఆన్ వీల్స్(Oxygen on Wheels). రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో ఈ పథకాన్ని ఎంపీ మార్గాని భరత్ ఆలోచనకు అనుగుణంగా ప్రారంభించారు.
ఏపీఎస్సార్టీసీ గ్యారేజ్ నుంచి రెండు వెన్నెల బస్సుల్ని ఈ సేవలకు వినియోగిస్తున్నారు. 36 సీట్ల సామర్ధ్యం కలిగిన బస్సులో ఆరు బెడ్స్ పూర్తిగా ఆక్సిజన్ సౌకర్యంతో ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి రెండు బస్సుల్ని సిద్దం చేశారు. ఒక్కొక్క బస్సును మినీ ఐసీయూలా మార్చారు. ఆసుపత్రుల్లో బెడ్స్ లేక ఇబ్బంది పడే రోగులకు బెడ్ లభించేవరకూ ఈ బస్సులో ఉంచి ఆక్సిజన్ అందిస్తారు. ఈ పథకం విజయవంతమైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan) దృష్టికి తీసుకువెళ్తానని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ( Margani Bharat) చెబుతున్నారు.
Also read: Ap Corona Update: ఏపీలో ఆగని కరోనా ఉధృతి , 24 గంటల్లో 21 వేల కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook