Raghuramakrishnam raju: అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రత్యేక జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో పరీక్షలు జరుగుతున్నాయి.
ఏపీ ప్రభుత్వాన్ని(Ap government) అస్థిరపర్చే కుట్ర, కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్న అభియోగాలపై అధికార పార్టీ ఎంపీ, నర్శాపురం లోక్‌సభ నుంచి ఎన్నికైన రఘురామకృష్ణంరాజు అరెస్టు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఈ కేసులో రఘురామకృష్ణంరాజు(Raghuramakrishnam raju)కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు..తనకు రమేశ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయాలన్న విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చింది. మధ్యేమార్గంగా సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను వీడియో షూట్ చేసి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) రిజిస్ట్రార్ జనరల్ ద్వారా సీల్డ్ కవర్లో పంపాలని సూచించింది. అంతేకాకుండా వైద్య పరీక్షల పర్యవేక్షణకు జ్యుడీషియల్ అధికారిని నియమించే బాధ్యతను తెలంగాణ హైకోర్టుకు అప్పగించింది.
సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాల ప్రకారం జ్యుడిషియల్ రిజిస్ట్రార్ నాగార్జునను జ్యుడిషియల్ అధికారిగా తెలంగాణ హైకోర్టు నియమించింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో రఘురామకృష్ణంరాజుకు ముగ్గురు ఆర్మీ వైద్యుల బృందం పరీక్షలు నిర్వహిస్తోంది. మరోవైపు ఈ ప్రక్రియను అధికారులు వీడియో తీస్తున్నారు. వైద్య పరీక్షలు పూర్తయిన తరువాత సీల్డ్ కవర్లో మెడికల్ నివేదికను సుప్రీంకోర్టుకు అందించనున్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
Also read: AP High Court: ప్రైవేటు ఆసుపత్రులు త్వరలో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో వెళ్లనున్నాయా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook