AP High Court: ప్రైవేటు ఆసుపత్రులు త్వరలో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో వెళ్లనున్నాయా

AP High Court: కోవిడ్ బాధితుల చికిత్స విషయమై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రైవేటు ఆసుపత్రుల్ని రాష్ట్ర ప్రభుత్వం తమ ఆధీనంలో తీసుకోవాలని సూచనలు జారీ చేసింది. రోగులకు నిర్ధిష్ట సమాచార వ్యవస్థ అమలు చేయాలని కోరింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 18, 2021, 09:46 AM IST
AP High Court: ప్రైవేటు ఆసుపత్రులు త్వరలో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో వెళ్లనున్నాయా

AP High Court: కోవిడ్ బాధితుల చికిత్స విషయమై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రైవేటు ఆసుపత్రుల్ని రాష్ట్ర ప్రభుత్వం తమ ఆధీనంలో తీసుకోవాలని సూచనలు జారీ చేసింది. రోగులకు నిర్ధిష్ట సమాచార వ్యవస్థ అమలు చేయాలని కోరింది.

కోవిడ్‌కు సంబంధించి దాఖలైన పలు పిటీషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Ap High Court) విచారణ సందర్బంగా పలు కీలక వ్యాఖ్యలు వెలువడ్డాయి. జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ కన్నెగంటి లలితల ధర్మాసనం ఈ పిటీషన్లపై విచారణ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్‌ బాధితులకు తగిన చికిత్స అందించేందుకు వీలుగా ప్రైవేట్‌ ఆస్పత్రులను (Private Hospitals) తన అజమాయిషీలోకి తీసుకునే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని హైకోర్టు కోరింది. దీనివల్ల చాలా మందికి చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. రోగులకు బెడ్ల ఖాళీల వివరాలను తెలిపేందుకు నిర్దిష్ట సమాచార వ్యవస్థను అమల్లోకి తీసుకురావాలంది. ప్రస్తుతం ఉన్న టోల్‌ఫ్రీ నంబర్‌ 104తో పాటు మరో నంబర్‌ను కూడా అందుబాటులోకి తీసుకురావాలంది. వ్యాక్సిన్‌ వేసేటప్పుడు కోవిడ్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. వ్యాక్సిన్‌ (Vaccine) విషయంలో వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని..దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.కేసు విచారణను ఈ నెల 20వ తేదీకు వాయిదా వేసింది.

కర్ఫ్యూ (Curfew) సత్ఫలితాలనిస్తోందని..ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు(Remdesivir Injections) తగిన సంఖ్యలో రాష్ట్రానికి రావడం లేదని ప్రభుత్వం తెలిపింది. 2.35 లక్షల వయల్స్ పంపుతానని చెప్పిన కేంద్రం కేవలం 95 వేల వయల్స్ మాత్రమే పంపిందని పేర్కొంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను కొనుగోలు చేస్తోందని స్పష్టం చేసింది. అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై కేసులు నమోదు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది సుమన్ తెలిపారు. రోగుల పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్న ప్రైవేటు అంబులెన్సులపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ నియంత్రణలో తీసుకునే విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు సూచించింది. 

Also read: Ap Government: కోవిడ్‌తో తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలకు వైఎస్ జగన్ ఆసరా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News