Deadline for Whatsapp: ప్రైవసీ పాలసీపై వాట్సప్‌కు కేంద్రం హెచ్చరిక, ఏడు రోజుల డెడ్‌లైన్

Deadline for Whatsapp: ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం వాట్సప్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. వాట్సప్ కొత్త ప్రైవసీ పాలనీను వెనక్కి తీసుకోవాలంటూ వారం రోజుల డెడ్‌లైన్ విధించింది. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 19, 2021, 05:46 PM IST
Deadline for Whatsapp: ప్రైవసీ పాలసీపై వాట్సప్‌కు కేంద్రం హెచ్చరిక, ఏడు రోజుల డెడ్‌లైన్

Deadline for Whatsapp: ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం వాట్సప్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. వాట్సప్ కొత్త ప్రైవసీ పాలనీను వెనక్కి తీసుకోవాలంటూ వారం రోజుల డెడ్‌లైన్ విధించింది. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది.

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సప్‌కు(Whatsapp) ఇండియాలో కష్టాలెదురయ్యేట్టే ఉన్నాయి. వాట్సప్ కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీపై( Privacy Policy)కేంద్ర ప్రభుత్వం (Central government) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.ఇప్పుడు వాట్సప్‌కు కొత్తగా కేంద్ర ప్రభుత్వం డెడ్‌లైన్ విధించింది. ప్రైవసీ పాలసీను ఉపసంహరించుకోవాలంటూ వారం రోజుల డెడ్‌లైన్ విధించి..వివరణ కోరుతూ వాట్సప్‌కు నోటీసులు జారీ చేసింది. ఒకవేళ విఫలమైతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. గోప్యతా విధానం అమలు వాయిదా వేయడం ద్వారా అంతర్జాతీయ యూజర్ల గోప్యతా విధానం, భద్రతా నిబంధనల విషయంలో తప్పించుకోలేరని వాట్సప్‌కు పంపిన నోటీసుల్లో పేర్కొంది. సమాచార గోప్యత, డేటా భద్రత, యూజర్ల ఎంపికలకు ఈ విధానం వ్యతిరేకమని కేంద్రం వెల్లడించింది.

వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీ యూజర్ల హక్కుల్ని ఎలా భంగం కల్గిస్తుందనేది నోటీసుల్లో(Central government notices to whatsapp) స్పష్టంగా ఉంది. దేశ ప్రజల హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని..అందుకే ఏడు రోజుల గడువిస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తెలిపింది. ఏడురోజుల్లోగా సమాధానం లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. 

Also read: Viral News: లాక్‌డౌన్‌లో భార్యను కలుసుకునేందుకు Bus చోరీ చేసిన ఘనుడు, పోలీసులు షాక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News