ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఏపీ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల (AP Parishad Elections 2021) నోటిఫికేషన్ విడుదల చేయలేదని హైకోర్టు పేర్కొంది. ఎన్నికలు నిర్వహించడానికి కనీసం 4 వారాల ముందు ఎన్నికల నోటికేషన్ జారీ చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదని, కనుక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ఏపీలో పరిషత్ ఎన్నికలు మళ్లీ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ పరిషత్ ఎన్నికలపై ఆది నుంచే ఉత్కంఠ
వాస్తవానికి సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం నాలుగు వారాలకు ముందుగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. కానీ ఏపీలో కొత్త ఎలక్షన్ కమిషన్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే పరిషత్ ఎన్నికల తేదీలు ప్రకటించారు. ఏప్రిల్ 1న ఎన్నికల(AP Parishad Election 2021) తేదీలు ప్రకటించగా, 8న ఓటింగ్ జరిగింది. అయితే సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా నోటిషికేషన్ విడుదల జరిగిందని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు, ఇతర విపక్షాలు హైకోర్టును ఆశ్రయించాయి.
Also Read: AP Parishad Elections: ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్
తొలుత ఏప్రిల్ 6వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే ఇచ్చింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన స్టేను రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇరు వర్గాల తరుఫున వాదనలు విన్న డివిజన్ బెంచ్ ఏపీలో పరిషత్ ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. దాంతో ఏప్రిల్ 8న 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించారు.
డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ప్రతిపక్షాలు హైకోర్టును ఆశ్రయించాయి. తాజాగా విచారణ పూర్తి కావడంతో ఎన్నికల నోటిఫికేషన్‌ను ఏపీ హైకోర్టు(AP High Court) రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ఏపీలో ఎంపీటీసీ, జడ్పీడీసీ ఎన్నికలు మరోసారి నిర్వహించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు ఆదేశించింది. కౌంటింగ్ విషయంలోనూ హైడ్రామా జరగడం తెలిసిందే. కోర్టుల ఆదేశాలతో తొలుత ఏలూరు మినహా ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు లెక్కింపు జరిగింది. అనంతరం కోర్టు తీర్పుతో ఏలూరు ఎన్నికల ఓట్ల లెక్కింపు సైతం నిర్వహించారు. కానీ తాజాగా ఏపీ పరిషత్ ఎన్నికలు రద్దయ్యాయి.
Also Read: ఏపీ COVID-19 హెల్త్ బులెటిన్.. కరోనాతో వణికిపోతున్న జిల్లా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook