CA Examination Schedule: సీఏ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఐసీఏఐ

CA Examination Schedule: ప్రతిష్ఠాత్మక ఛార్టెడ్ అక్కౌంటెంట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన పరీక్షల్ని తిరిగి నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 7, 2021, 12:38 PM IST
CA Examination Schedule: సీఏ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఐసీఏఐ

CA Examination Schedule: ప్రతిష్ఠాత్మక ఛార్టెడ్ అక్కౌంటెంట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన పరీక్షల్ని తిరిగి నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి.

ఇండియాలో కరోనా మహమ్మారి(Corona Pandemic) కారణంగా సీఏ పరీక్షలు (CA Exams) వాయిదా పడ్డాయి. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా ఛార్టెడ్ అకౌంటెంట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు కరోనా ఉధృతి కాస్తంత తగ్గుముఖం పడుతుండటంతో తిరిగి నిర్వహించేందుకు ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సన్నద్ధమవుతోంది. సీఏ పరీక్షల్ని జూలై 5 నుంచి జూలై 20వ తేదీ వరకూ నిర్వహించనున్నట్టు ఐసీఏఐ(ICAI) ప్రకటించింది. సీఏ పరీక్షల షెడ్యూల్ (CA Exams Schedule) విడుదల చేసింది. ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటల్నిచి పరీక్షలు జరగనున్నాయి.

పరీక్షల షెడ్యూల్ ఇలా ఉంది

ఇంటర్మీడియట్ ఐపీసీ కోర్సు పరీక్షల్లో (IPC Course Exams) ఓల్డ్ స్కీమ్ గ్రూప్ 1 అయితే జూలై 6, 8, 12 తేదీల్లోనూ గ్రూప్ 2 జూలై 14, 16, 18 తేదీల్లోనూ నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ ఐపీసీ న్యూ స్కీమ్ గ్రూప్ 1 అయితే జూలై 6, 8,12 తేదీల్లోనూ, గ్రూప్ 2 పరీక్షలు జూలై 14, 16, 18 ,20 తేదీల్లో జరగనున్నాయి.

ఇక సీఏ ఫైనల్ పరీక్షల్లో(CA Final Exams) గ్రూప్ 1 జూలై 5, 7, 9, 11 తేదీల్లోనూ, గ్రూప్ 2 జూలై 13, 15, 17, 19 తేదీల్లో జరగనున్నాయి. ఫైనల్ కోర్సు న్యూ స్కీమ్‌లో గ్రూప్ 1 పరీక్షలు జూలై 5,7,9,11 తేదీల్లో గ్రూప్ 2 అయితే జూలై 13,15,17,19 తేదీల్లో జరగనున్నాయి. ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్ టెక్నికల్ పరీక్షలో 1 నుంచి 4 మాడ్యూల్స్ వరకూ జూలై 5, 7, 9, 11 తేదీల్లో జరగనున్నాయి. ఇంటర్నేషనల్ టాక్సేషన్ టెస్ట్ జూలై 5,7 తేదీల్లో జరగనుంది.

Also read: India Corona Cases Today: ఇండియాలో తాజాగా లక్ష కరోనా కేసులు, 3.5 లక్షలకు చేరువలో COVID-19 మరణాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News