Bombay High Court: బీసీసీఐకు బోంబే హైకోర్టు ఊరట నిచ్చింది. ఐపీఎల్ ఫ్రాంచైజ్ దెక్కన్ ఛార్జర్స్ కేసులో బీసీసీఐకు పెద్దఎత్తున రిలీఫ్ లభించింది. 48 వందల కోట్లు చెల్లించకుండా ప్రయోజనం కలిగింది.
2008లో ఐపీఎల్ (IPL) ప్రారంభమైంది. ఇందులో భాగంగా బీసీసీఐ వివిధ ఫ్రాంచైజి జట్లతో ఒప్పందం చేసుకుంది. ఈ నేపధ్యంలో డీసీహెచ్ఎల్ అంటే దెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ సంస్థ దెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ పేరిట జట్టును బరిలో దింపింది. ఈ ఒప్పందం పదేళ్ల కోసం కుదిరింది. అయితే బోర్డు నిబంధనల్ని ఉల్లంఘించిందన్న ఆరోపణలతో బీసీసీఐ 2012 సెప్టెంబర్ నెలలో దెక్కన్ ఛార్జర్స్‌ను (Deccan Chargers) లీగ్ నుంచి తప్పించింది. ఆటగాళ్లు కాంట్రాక్టులు రద్దు చేసి వేలంలో నిలిపింది. దాంతో తమకు అన్యాయం జరిగిందంటూ డీసీహెచ్ఎల్ (DCHL) సంస్థ బోంబే హైకోర్టును ఆశ్రయించగా...సుప్రీంకోర్టు(Supreme Court) రిటైర్డ్ జడ్జ్ సీకే థక్కర్ సమక్షంలో సమస్య పరిష్కరించుకోవాలని సూచించింది.
ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ సీకే థక్కర్..గత ఏడాది డీసీహెచ్ఎల్‌కు అనుకూలంగా తీర్పునిచ్చారు. 4 వేల 8 వందల కోట్లు చెల్లించాల్సిందిగా బీసీసీఐని ఆదేశించారు. దీనిపై బీసీసీఐ బోంబే హైకోర్టును (Bombay High court) ఆశ్రయించింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన జస్టిస్ జీఎస్ పటేల్ ధర్మాసనం ఆర్బిట్రేటర్ ఆదేశాల్ని తొసిపుచ్చుతూ బీసీసీఐ(BCCI)కు ఊరట కల్పించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook