YS Jagan: కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఏపీలో జూన్ 20 తరువాత కర్ఫ్యూ పరిస్థితి ఏమిటి..కర్ఫ్యూ పొడిగిస్తారా లేదా సడలింపులుంటాయా..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏమంటున్నారు.
కరోనా మహమ్మారి నియంత్రణకై ఏపీ ప్రభుత్వం (Ap government) మే 5వ తేదీ నుంచి రోజుకు 18 గంటల కర్ఫ్యూ అమలు చేస్తోంది. జూన్ 20వ తేదీ వరకూ ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. గత కొద్దిరోజులుగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. జూన్ 20 నుంచి కర్ఫ్యూ మరోసారి పొడిగిస్తారా లేదా సడలింపులుంటాయా (Curfew Relaxations) అనే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టతనిచ్చారు. క్యాంపు కార్యాలయంలో ఇవాళ జరిగిన స్పందన సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోవిడ్ సంబంధిత విషయాలపై మాట్లాడారు.
జూన్ 20 తరువాత ఏపీలో కర్ఫ్యూ సడలింపులుంటాయని వైఎస్ జగన్ (Ap cm ys jagan) వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మూడున్నర కోట్ల మందిలో 69 లక్షలమందికి సింగిల్ డోసు వ్యాక్సిన్ ఇచ్చినట్టు వైఎస్ జగన్ చెప్పారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 26 లక్షల 33 వేల 351 మందికి రెండు డోసులు పూర్తయ్యాయన్నారు. గ్రామాల్లో ఫీవర్ సర్వే కొనసాగించాలని సూచించారు. కోవిడ్ వైద్య సేవల్ని ఆరోగ్య శ్రీ పథకం కిందకు తీసుకొచ్చామని గుర్తు చేశారు. 89 శాతం కోవిడ్ బాధితులు ఆరోగ్య శ్రీ కింద చికిత్స తీసుకున్నారన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మొదటిసారి ఉల్లంఘిస్తే పెనాల్టీ విధిస్తామని..రెండవసారి చేస్తే..క్రిమినల్ కేసులు నమోదవుతాయని తెలిపారు. కరోనా థర్డ్‌వేవ్ (Corona Third Wave) ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. విశాఖ, గుంటూరు, కృష్ణా, తిరుపతిలో చిల్డ్రన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు చిన్నారులకు వైద్య సేవలందిస్తాయన్నారు.
Also read: AP High Court: ఏపీ గ్రూప్ 1 ఇంటర్వ్యూలపై హైకోర్టు స్టే, తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
YS Jagan: కోవిడ్19 పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష, జూన్ 20 తరువాత సడలింపులు