MLA Roja on KRMB row: తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రులకు ఎమ్మెల్యే రోజా హెచ్చరిక

MLA Roja warns Telangana govt and ministers over KRMB issues: అమరావతి: తెలంగాణ సర్కారు ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలకు అన్యాయం చేయొద్దని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలంగాణ సర్కారుకు విజ్ఞప్తిచేశారు. క్రిష్ణా రివర్ (Krishna river water row) నీటి వినియోగం విషయంలో తెలంగాణ మంత్రులు మళ్లీ ఆంధ్రా, తెలంగాణ మధ్య ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొట్టొద్దని విజ్ఞప్తి చేసిన రోజా.. నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ రోజుకొక మాట మాట్లాడతారని ఆరోపించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 3, 2021, 07:00 AM IST
MLA Roja on KRMB row: తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రులకు ఎమ్మెల్యే రోజా హెచ్చరిక

MLA Roja warns Telangana govt and ministers over KRMB issues: అమరావతి: తెలంగాణ సర్కారు ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలకు అన్యాయం చేయొద్దని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలంగాణ సర్కారుకు విజ్ఞప్తిచేశారు. పవర్ జనరేషన్ పేరుతో నీటి కేటాయింపులకు తూట్లు పొడవద్దన్న రోజా.. క్రిష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ (KRMB) కేటాయింపుల ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం నీటిని ఉపయోగించుకోవాలని కోరారు. 

క్రిష్ణా రివర్ (Krishna river water row) నీటి వినియోగం విషయంలో తెలంగాణ మంత్రులు మళ్లీ ఆంధ్రా, తెలంగాణ మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దని విజ్ఞప్తి చేసిన రోజా.. నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ రోజుకొక మాట మాట్లాడతారని ఆరోపించారు. నీటి వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ఆనాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డిని, కానీ లేదా ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని (AP CM YS Jagan) కానీ ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే రోజా (MLA Roja) తెలంగాణ ప్రభుత్వాన్ని, మంత్రులను హెచ్చరించారు. 

నాగార్జున సాగర్ ప్రాజెక్టు (Nagarjuna sagar dam) వద్ద విద్యుత్ ఉత్పత్తిని నిలిపేయాల్సిందిగా కోరుతూ వచ్చిన ఏపీ అధికారులను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి పంపడంతో పాటు ఏపీ ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై పలువురు తెలంగాణ మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే రోజా ఈ వ్యాఖ్యలు చేశారు.

Trending News