Cardiac Issues: కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నా..ప్రమాదం పొంచే ఉంటోంది. కరోనా వైరస్ యువకులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గుండెపోటు సమస్యలకు కారణమవుతోంది. అసలేం జరుగుతోంది..పరిష్కారమేంటి..
కరోనా వైరస్ (Coronavirus)ఉధృతి తగ్గుముఖం పట్టినా..తదనంతర పరిణామాలు ఇబ్బంది కల్గిస్తున్నాయి. కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత కూడా ప్రమాదం పొంచి ఉంటోంది. కరోనా వైరస్ నుంచి కోలుకున్న యువకుల్లో రక్తం గడ్డ కట్టడంతో పాటు గుండెపోటు సమస్య(Cardiac Issues) అధికంగా కన్పిస్తోంది. బెంగళూరులో ఇటువంటి కేసులు 31 మందిలో కన్పించాయి. కోవిడ్ నుంచి కోలుకున్న నాలుగు వారాల్లో 31 మంది గుండెపోటు వచ్చి ఆసుపత్రి పాలయ్యారు. ఈ 31 మందిలో ఆరుగురికి యాంజియోప్లాస్టి, ముగ్గురికి బైపాస్ సర్జరీ చేయించాల్సి వచ్చింది. కోవిడ్ నుంచి కోలుకున్నవారిలో కరోనా లక్షణాల జాడలు 1-3 నెలల వరకూ ఉంటున్నాయని వైద్యులు తెలిపారు. 21-108 రోజుల వరకూ గుండె సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి.
కరోనా మొదటి దశ కంటే..రెండవ దశ(Corona Second Wave)లోనే ఈ సమస్య ఎక్కువగా కన్పిస్తోంది.పెద్ద మొత్తంలో మందులు వాడి కోలుకున్న తరువాత గుండె ధమనుల్లో వాపుతో గుండెపోటు ప్రమాదం పెరుగుతోంది. యువకులకు కోవిడ్ చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల రక్తం గడ్డకట్టే (Blood Clotting) ప్రమాదం పెరిగింది. రక్తం చిక్కబడటంతో ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతున్నాయి. అందుకే కరోనా నుంచి కోలుకున్న తరువాత వైద్యుల సలహాతో రక్తం పల్చబడే ఔషధాలు వినియోగించాల్సి ఉంటుంది.
Also read: Kerala Zika Virus Cases: కేరళలో మరో జికా వైరస్ పాజిటివ్ కేసు నమోదు, ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Cardiac Issues: కరోనా నుంచి కోలుకున్న యువతలో..గుండెపోటు సమస్యలు