Komati Reddy Rajgopal Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Congress MLA Komati Reddy Rajgopal Reddy : సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వకపోవడంతో పార్టీ మారే ఉద్దేశం ఉందా అనే ఊహాగానాలు కొనసాగుతున్నాయి. పార్టీ మారడం అంశంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టత ఇచ్చారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 13, 2021, 10:21 AM IST
Komati Reddy Rajgopal Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Congress MLA Komati Reddy Rajgopal Reddy: పార్టీ మారే ఉద్దేశమే లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం కారణంగానే అధికారంలోకి రాలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని కానీ నాయకత్వ లోపాల వల్లే అధికారంలోకి రాలేకపోయాయని వ్యాఖ్యానించారు.

సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy)కి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వకపోవడంతో పార్టీ మారే ఉద్దేశం ఉందా అనే ఊహాగానాలు కొనసాగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడారు. పార్టీ మారడం అంశంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఇప్పట్లో తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదన్నారు. పార్టీ తీసుకునే నిర్ణయాలు, కార్యకర్తలు, మద్దతుదారుల అభీష్టం మేరకు తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. సరైన నిర్ణయాలు తీసుకుంటే పార్టీ బలోపేతం అవుతుందని, పీసీపీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడిందని తాను గతంలో చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉందన్నారు.

Also Read: Kaushik Reddy audio tapes: కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News