జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ షాట్ వ్యాక్సిన్‌కు ఇండియాలో అనుమతి

Johnson and Johnson Vaccine: దేశంలో మరో అంతర్జాతీయ వ్యాక్సిన్ అందుబాటులో వస్తోంది. అది కూడా ఏ విధమైన ఇబ్బందుల్లేకుండా సింగిల్ డోసు వ్యాక్సిన్. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు అనుమతి జారీ చేసింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 7, 2021, 04:48 PM IST
జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ షాట్ వ్యాక్సిన్‌కు ఇండియాలో అనుమతి

Johnson and Johnson Vaccine: దేశంలో మరో అంతర్జాతీయ వ్యాక్సిన్ అందుబాటులో వస్తోంది. అది కూడా ఏ విధమైన ఇబ్బందుల్లేకుండా సింగిల్ డోసు వ్యాక్సిన్. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు అనుమతి జారీ చేసింది. 

దేశవ్యాప్తంగా కోవిడ్ సంక్రమణను అడ్డుకునేందుకు వ్యాక్సినేషన్ (Vaccination)ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. దేశంలో ఇప్పటి వరకూ కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మరో అంతర్జాతీయ వ్యాక్సిన్ అందుబాటులో రానుంది. ప్రముఖ అంతర్జాతీయ ఫార్మా కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన సింగిల్ డోసు వ్యాక్సిన్(Single Shot Vaccine) కు కేంద్రం అనుమతిచ్చింది. ఈ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి వాడవచ్చని కేంద్రం తెలిపింది. ఇది సింగిల్ డోసు కావడంతో సౌలభ్యంగా ఉంటుంది. అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్(Johnson and Johnson) సంస్థ అత్యవసర వినియోగ అనుమతి కోరుతూ ఆగస్టు 5వ తేదీన డ్రగ్ కంట్రోలర్ అండ్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకుంది. ఇవాళ కేంద్రం అత్యవసర అనుమతి జారీ చేసింది. ఇక త్వరలో భారతీయ మార్కెట్లో జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ షాట్ వ్యాక్సిన్ అందుబాటులో రానుంది. 

Also read: సింగిల్ డోస్ వ్యాక్సిన్స్ వచ్చేస్తున్నాయ్.. అనుమతికి జాన్సన్ అండ్ జాన్సన్ దరఖాస్తు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News