Afghan Crisis: ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి తాలిబన్ రాజ్యం ఏర్పడింది. పొట్టకూటి కోసం ఆఫ్ఘన్ వెళ్లిన తెలంగాణవాసులు అక్కడే చిక్కుకుపోయారు. స్వదేశం వచ్చేందుకు తిప్పలు పడుతున్నారు. ఏం చేయాలో తోచక బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.
తాలిబన్లు (Talibans)ఆఫ్ఘన్ నేలను మరోసారి ఆక్రమించడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటికే విదేశీ సైన్యం తరలిపోగా..వివిధ దేశాల దౌత్యసిబ్బంది ఆయా దేశాలకు చేరుకుంటున్నారు. భారత దౌత్యసిబ్బంది కూడా కార్యాలయాన్ని ఖాళీ చేశారు. ఈ క్రమంలో ఉద్యోగం కోసం, కూలి పనుల కోసం ఆఫ్ఘన్‌కు వెళ్లిన తెలంగాణ వాసులు అక్కడే ఇరుక్కుపోయారు. కొందరు క్షేమంగా ఇండియాకు వచ్చేయగా..మరికొందరు ఏం చేయాలో తోచక చిక్కుకుపోయారు. అసలు ఇలాంటివారు ఆఫ్ఘన్ నేలపై ఎంతమంది ఉన్నారో కూడా కచ్చితంగా తెలియడం లేదు. పొట్టకూటికోసం అక్కడికి వెళ్లిన వలస కార్మికులకు(Telangana Migrant workers)ఉపాధి కాస్తా పోయింది. వీసా గడువున్నా వదిలి రాక తప్పని పరిస్థితి.
అమెరికా సైన్యానికి(American Military)సేవలందించే ఉద్యోగావకాశాల కోసం వెళ్లిన తెలంగాణకు (Telangana)చెందిన చాలమంది యువకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అక్కడి రాయబార కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తే ఉద్యోగానికి ఢోకా ఉండదని భావించారు. ఏజెన్సీల మెప్పు పొంది అమెరికా, ఇతర దేశాల రాయబార కార్యాలయాల్లో పనులు చేసుకుంటున్నారు. ఇంతలో తాలిబన్లు ఆఫ్ఘన్‌ను(Afghanistan) ఆక్రమించడంతో వివిధ దేశాల దౌత్య కార్యాలయాలు ఖాళీ అయిపోయాయి. ఫలితంగా ఆ కార్యాలయాల్లో ఉద్యోగాల కోసం వెళ్లిన వాళ్లంతా చిక్కుకుపోయారు.
కొందరు కాబూల్(Kabul)లో చిక్కుకుపోగా..మరికొందర్ని ఖతర్‌కు తరలించారు. అక్కడ ఎంతకాలం ఉంచుతారో ఎక్కడికి పంపిస్తారో తెలియక ఇబ్బంది పడుతున్నారు. 20 ఏళ్ల నుంచి వివిధ దౌత్య కార్యాలయాల్లో పనిచేసి..ఇప్పుడు హఠాత్తుగా ఉద్యోగాలు పోవడంతో దిక్కుతోచక కాలం వెళ్లదీస్తున్నారు. తాలిబన్లు ఆక్రమణకు ముందు సెలవుల కోసం ఇండియాకు వచ్చినవారు తిరిగి అక్కడికి వెళ్లలేక..ఉద్యోగాలు కోల్పోయి బాధపడుతున్నారు.
Also read: Corona Revaccination: కరోనా బూస్టర్ డోసుకు అనుమతి లేదంటున్న కేంద్ర ప్రభుత్వం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook