MAA Elections 2021: వర్చువల్ గా 'మా' కార్యవర్గ సమావేశం.. కీలక అంశాలపై చర్చ!

MAA: 'మా' ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. ఎన్నికలపై ఓ నిర్ణయానికి వచ్చేందుకు ‘మా’ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశం జరిగింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 22, 2021, 05:04 PM IST
  • నేడు వర్చువల్ గా 'మా' కార్యవర్గ సమావేశం
  • క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు అధ్యక్షతన భేటీ
  • పలు అంశాలపై చర్చ
MAA Elections 2021: వర్చువల్ గా 'మా' కార్యవర్గ సమావేశం.. కీలక అంశాలపై చర్చ!

MAA Elections: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) కార్యవర్గ సమావేశం ఇవాళ వర్చువల్ గా జరిగింది. ఈ సమావేశం క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు(Krishnam Raju) అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ‘మా’లోని కీలకసభ్యులు అసోసియేషన్‌ ఎన్నికలపై , ‘మా(MAA)లోని సమస్యలు, ఇప్పటివరకూ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. 

భవనం అమ్మకంపై ఎవరైనా మాట్లాడారా?: మోహన్‌బాబు
ఈ సమావేశంలో నటుడు మోహన్ బాబు(Actor Mohan babu) ప్రశ్నల వర్షం కురిపించాడు. ‘మా’ కోసం గతంలో ఓ భవనం కొని అమ్మేశారని మోహన్‌బాబు గుర్తుచేశారు. అధిక మొత్తంతో భవనాన్ని కొనుగోలు చేసి అతి తక్కువ ధరకే దానిని ఎందుకు అమ్మేశారని ప్రశ్నించారు. అసోసియేషన్‌ భవనం అమ్మకంపై ఎవరైనా మాట్లాడారా? అని నిలదీశారు. అసోసియేషన్‌ భవనం విషయం తనని ఎంతో కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: MAA Elections: 'మా'లో మొదలైన మాటల యుద్ధం... హేమ పై నరేష్, జీవిత సీరియస్

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలు(MAA Elections)  ప్రస్తుతం టాలీవుడ్‌(Tollywood)లో హాట్‌టాపిక్‌గా మారాయి.  ఎప్పుడు లేనంతగా ఈ సారి  అధ్యక్ష పదవీకి పోటీ పెరిగింది. ఇప్పటికే ప్రకాశ్ రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమ(Hema)లతో పాటు సీవీఎల్‌ నరసింహారావు అధ్యక్ష రేసులో ఉన్నామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. సాధారణ ఎన్నికల మాదిరి బహిరంగ విమర్శలు కూడా చేసుకుంటున్నారు.

త్వరగా ‘మా’ ఎన్నికలు నిర్వహించండి: ప్రకాశ్‌రాజ్‌
కాగా, ఈ సమావేశంలో పాల్గొన్న ప్రకాశ్‌రాజ్‌(Prakash Raj) ‘ఈ ఏడాది జరగాల్సిన ‘మా’ అసోసియేషన్‌ ఎన్నికలు త్వరితగతిన జరిగేలా చూడాలని కోరారు.. వీలైతే సెప్టెంబర్‌ 12 లేదా 19 తేదీల్లో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి’ అని కృష్ణంరాజుకి విజ్ఞప్తి చేశారు. ‘సినిమా బిడ్డలం‌’ పేరుతో ప్యానల్‌ ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీకి ప్రకాశ్‌రాజ్‌(Prakash Raj)  సర్వం సిద్ధం చేసుకున్నారు. 

మరోవైపు మంచు విష్ణు(Manchu Vishnu) సైతం అధ్యక్ష పదవి సాధించేందుకు కావాల్సిన వ్యుహాలు పన్నుతున్నారు. ఎన్నికల వ్యవహారం తెరపైకి వచ్చినప్పటి నుంచి సభ్యులందరూ ఒకరిపై ఒకరూ పరోక్ష వ్యాఖ్యలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మెగాస్టార్‌ చిరంజీవి(Megastar Chiranjeevi).. ‘మా’ ఎన్నికల విషయంలో త్వరితగతిన ఓ నిర్ణయానికి రావాలని క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు ఇటీవల ఓ లేఖ రాశారు. సభ్యుల పరోక్ష విమర్శల కారణంగా అసోసియేషన్‌ ప్రతిష్టకు భంగం కలిగే ప్రమాదముందన్నారు. దీంతో ఆదివారం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter Facebook

Trending News