Breaking News: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అమరిందర్ సింగ్

అసెంబ్లీ ఎన్నికలకు ముందే నాయకత్వ మారింది.. ఈ రోజు పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ పదవికి రాజీనామా చేసారు

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 18, 2021, 05:15 PM IST
Breaking News: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అమరిందర్ సింగ్

Punjab Crisis: కొన్ని నెలలుగా సాగుతున్న ప్రచారానికి  ఈ రోజు తెర పడింది. పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ రాజీనామా చేశారు. ఈ రోజు గవర్నర్ ను కలిసిన అమరీందర్‌ సింగ్‌ రాజీనామా పత్రాన్ని సమర్పించారు. 

రాజీనామా అనంతరం, మీడియాతో మాట్లాడుతూ" ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేలతో సమావేశాలు పెట్టి నను అవమానించారు, ప్రభుత్వాన్ని నడపలేనని అనుకున్నట్లున్నారు. ఎవరి మీద నమ్మకముంటే వారిని సీఎం చేసుకోమని చెప్పా" అని అమరిందర్ సింగ్  తెలిపారు. రాజీనామాతో వివాదం మరింత పెద్దది అయింది. 

Also Read: Sonu Sood Income Tax: సోనూసూద్ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేత, దాతల నుంచి సేకరించిన విరాళాలనూ ఖర్చు పెట్టలేదట

పంజాబ్ కాంగ్రెస్ ఛీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ(Navajyoth singh sidhu), ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ మధ్య గత కొద్దికాలంగా ఉన్న విభేదాలు పెరిగి పెద్దదయ్యాయి. పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం ముదిరిపోయింది. సిద్ధూతో విభేదాల నేపధ్యంలో ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోనియా గాంధీపై గౌరవంతోనే ఇన్నాళ్లూ..రాష్ట్ర కాంగ్రెస్‌లో జరిగిన నాయకత్వ మార్పుల్ని అంగీకరించానని..ఇకపై పార్టీలో ఉండలేనని స్పష్టం చేసారు మరియు ఇప్పటి వరకూ పార్టీలో జరిగిన అవమానాలు చాలని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. 

Also Read: Kajal Aggarwal Pregnancy Rumours: తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్..? త్వరలోనే సినిమాలకు గుడ్ బై..??

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News