IPL 2021: ఐపీఎల్‌ను వెంటాడుతున్న కోవిడ్ 19... SRH ప్లేయర్ నటరాజన్ కు కరోనా పాజిటివ్..!

ఈ రోజు IPLలో హైదరాబద్ వర్సెస్ డిల్లీ మ్యాచ్ జరగనుండగా, SRH ప్లేయర్ నటరాజన్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. వైద్య బృందం ఆటగాడితో సన్నిహితంగా ఉన్న ఆరుగురిని గుర్తించి, వారిని కూడా క్వారంటైన్ లో ఉంచారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 22, 2021, 04:24 PM IST
  • SRH ప్లేయర్ నటరాజన్ కు కరోనా పాజిటివ్
  • కొనసాగనున్న హైదరాబాద్- ఢిల్లీ మ్యాచ్
  • ట్విట్టర్ వేదికగా వెల్లడించిన IPL యాజమాన్యం
IPL 2021: ఐపీఎల్‌ను వెంటాడుతున్న కోవిడ్ 19... SRH ప్లేయర్ నటరాజన్ కు కరోనా పాజిటివ్..!

SRH Player Natarajan Tested Corona Positive: సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ప్లేయర్ టి నటరాజన్ (T Natarajan) కు జరిపిన ఆర్‌టి-పిసిఆర్ పరీక్షలో కోవిడ్ -19 పాజిటివ్ సోకిందని నిర్దారణ జరిగింది. ఫలితాలు తెలియగానే నటరాజన్ ఇతర ఆటగాళ్లకు దూరంగా ఉండటమే కాకుండా ఆసుపత్రిలో చేరాడు.  నటరాజన్ కు కరోనా లక్షణాలు లేకున్నా, సన్నిహితంగా ఉన్న ఆరుగురి ఆటగాళ్లకు పరీక్ష జరపగా నెగెటివ్ రావటంతో ఈ రోజు మ్యాచ్ ఎలాంటి ఆటంకం లేకుండా జరగనుంది. 

బిసీసీఐ (Board of Control for Cricket in India) విడుదల చేసిన వివరాల ప్రకారం, టి నటరాజన్ తో సన్నిహితంగా ఉన్న ఆరుగురుని గుర్తించి వారినికూడా క్వారంటైన్ లో ఉంచారు. వారు ఎవరంటే.. ?? 

Also Read: Viral video: అధికార మదం...గ్రామ సమస్యల గురించి అడిగితే బూటుకాలితో తన్నిన సర్పంచ్.!

1) విజయ్ శంకర్ (Vijay Shankar)- ఆటగాడు
2) విజయ్ కుమార్ (Vijay Kumar)- టీమ్ మేనేజర్
3) శ్యామ్ సుందర్ జె (Shyam Sundar J)- ఫిజియోథెరపిస్ట్
4) అంజనా వన్నన్ (Anjana Vannan)- డాక్టర్
5) తుషార్ ఖేడ్కర్ (Tushar Khedkar)- లాజిస్టిక్స్ మేనేజర్
6) పెరియసామి గణేషన్ (Periyasamy Ganesan)- నెట్ బౌలర్

"ఈ రోజు 5 గంటలకు నటరాజన్ కు సన్నిహితంగా ఉన్న అందరికి RT-PCR పరీక్షలు నిర్వహించగా.. అందరికి నెగెటివ్ వచ్చింది. కావున, ఈ రోజు రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో (Dubai International Stadium) జరగబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) మధ్య మ్యాచ్ జరుగుతుందని" ఐపిఎల్ (IPL) యాజమాన్యం తెలిపింది

Also Read: PM Modi Us Tour: మోదీ, జో బిడెన్ మధ్య చర్చకు రానున్న ఆ కీలక అంశాలేంటి

ఐపిఎల్ 14 వ సీజన్ ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరియు ముంబై ఇండియన్స్ (MI) మ్యాచ్ తో తిరిగి ప్రారంభమైంది. భారత్ లో 27 మ్యచ్ ల తరువాత కరోనా కారణంగా ఆగిపోన ఈ టోర్నమెంట్ తిరిగి కరోనా నిబంధనల మధ్య ప్రారంభమైన విషయం మనకు తెలిసిందే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News