Sex Rocket in Hyderabad: సనత్‌నగర్‌లో సెక్స్ రాకెట్.. బంగ్లాదేశ్ మహిళలతో వ్యభిచారం!

పోలీసులకు అందిన పక్కా సమాచారంతో హైదరాబాద్ సనత్‌నగర్‌లో ఒక అపార్ట్‌మెంట్‌పై జరిపిన సోదాలలో బంగ్లాదేశ్ నుండి యువతులను అక్రమంగా తరలించి వారితో బలవంతంగా వ్యభిచారం నడుపుతున్న ముఠాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 7, 2021, 04:02 PM IST
  • హైదరాబాద్ సనత్‌నగర్‌లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేసిన పోలీసులు
  • బాంగ్లాదేశ్ నుండి యువతులను అక్రంగా తరలించి వ్యభిచారం
  • ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎరవేసి తీసుకొస్తున్న ముఠాలు
Sex Rocket in Hyderabad: సనత్‌నగర్‌లో సెక్స్ రాకెట్.. బంగ్లాదేశ్ మహిళలతో వ్యభిచారం!

Sex Rocket in Hyderabad: మహిళల అక్రమ రవాణా, వారితో గుట్టుగా వ్యభిచారం నిర్వహించడం లాంటి అసాంఘీక కార్యకలాపాలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. తాజాగా హెదరాబాద్ సనత్‌నగర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. స్థానిక అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం జరుగుతుందనే సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేశారు. దీంతో వారి రహస్యం బట్టబయలైంది. ఐదుగురు మహిళలు, ఇద్దరు నిర్వహాకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళలు బంగ్లాదేశ్ కు చెందినవారిగా గుర్తించారు. 

ఇద్దరు నిర్వాహకులు బంగ్లాదేశ్ నుంచి మహిళలను రప్పించి వ్యబిఛారం చేయిస్తున్నట్లు, ప్రస్తుతం వారి నుంచి సమాచారం సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి ప్రాథమిక విచారణ చేపట్టామని స్పష్టం చేశారు. కొన్ని ముఠాలు ఉద్యోగం ఇప్పిస్తామని బంగ్లాదేశ్ యువతులకు నమ్మబలికి భారత్ కు అక్రమంగా తరలిస్తున్నారని మరియు వారిని బలవంతంగా పడుపు వృత్తిలోకి నెట్టేస్తున్నారని పోలీసులు తెలిపారు.

Also Read: NTR Video Call with Fan: రీల్ హీరోనే కాదు.. మన యంగ్ టైగర్ రియల్ హీరో కూడా... Video

ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు అధికమయ్యాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ లో పేద, మధ్య తరగతి మహిళలను లక్ష్యంగా చేసుకొని వ్యభిచార కూపంలోకి నెడుతున్నారు. ఘరానా నేరస్తులు.. 
ఇటీవలే గుజరాత్ సూరత్ కు చెందిన ఓ వ్యక్తి మహిళల అక్రమ రవాణాకు పాల్పడటమే కాకుండా ఏకంగా 75 మందిని వివాహం చేసుకున్నాడు. అంతేకాకుండా 200 మందిని వ్యభిచారంలోకి నెట్టిన ఈ ఘరానా నేరస్తుడి వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. బంగ్లాదేశ్ నుంచి యువతులును తీసుకొచ్చి వారిచేత వ్యభిచారాన్ని నిర్వహించాడు. మధ్యప్రదేశ్ ఇండోర్ లో ఇటీవలే మరో సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టయింది. పోలీసులు 21 మంది అమ్మాయిలను రక్షించారు. 

వాట్సాప్ వేదికగా వ్యభిచారం..
గత నెలలో హైదరాబాద్ లో వాట్సాప్ వేదికగా ఖరీదైన హోటెళ్లలో విదేశీ యువతులతో జరుగుతున్న వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. గచ్చిబౌలిలోని ఓ ఐదు స్టార్ల హోటెల్ పై పోలీసులు దాడులు నిర్వహించి ఈ మూఠా గుట్టును బట్టబయలు చేశారు. యాపిల్స్, చెర్రీస్ ఉన్నాయని, ఏ దేశం యువతులైతే ఆ దేశం పండ్లు ఉన్నాయని వాట్సాప్ లో మెసేజులు చేస్తూ బడాబాబులకు ఎరవేస్తున్నారు. అంతా ఒకే అనుకుంటే ఫైవ్ స్టార్ హోటెళ్లలో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. 

Also Read: Chaysam Divorce: ప్రీతంపై పెరిగిన ట్రోల్స్.. స్పందించిన సమంత మేకప్ ఆర్టిస్ట్‌ సాధనాసింగ్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x