Pragya Jaiswal: కంచె బ్యూటీకి కొవిడ్..ఇన్ స్టా వేదికగా వెల్లడించిన ప్రగ్యా జైస్వాల్

Pragya Jaiswal:  కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని తాజాగా ఇన్ స్టా వేదికగా ఆమె ప్రకటించింది. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 10, 2021, 02:16 PM IST
  • ప్రగ్యా జైస్వాల్ కు కొవిడ్
  • ఇన్ స్టా వేదికగా వెల్లడించిన హీరోయిన్
  • అఖండ చిత్రయూనిట్ లో గుబులు
Pragya Jaiswal: కంచె బ్యూటీకి కొవిడ్..ఇన్ స్టా వేదికగా వెల్లడించిన ప్రగ్యా జైస్వాల్

Actress pragya jaiswal tested as covid 19 positive:  కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) అందరికి షాకిచ్చింది. తాను కోవిడ్ బారిన పడినట్టు ఇన్‏స్టా(Instagram) వేదికగా ప్రకటించింది. ఆదివారం జరిపిన టెస్టులలో తనకు కోవిడ్ పాజిటివ్(Covid positive) వచ్చిందని.. వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నా కానీ… కరోనా సోకినట్లు ఆమె తెలిపింది. 

అయితే ఈ అమ్మడు కోవిడ్ బారిన పడడం ఇది మొదటి సారి కాదని.. వ్యాక్సిన్ వేసుకోకముందు కూడా తనకు పాజిటివ్ వచ్చిందని చెప్పుకొచ్చింది.  ప్రస్తుతం తాను సెల్ఫ్ ఐసోలేటేడ్ చేసుకున్నానని.. అలాగే డాక్టర్ల సూచనలతో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలిపింది. అలాగే గత పది రోజుల నుంచి తనను కలిసిన ప్రతి ఒక్కరు కోవిడ్ టెస్ట్(Covid Test) చేయించుకోవాలని.. అలాగే జాగ్రత్తలు తీసుకోవాలని ఇన్‏స్టా వేదికగా విజ్ఞప్రి చేసింది ప్రగ్యా. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)

Also Read: Balakrishna: ‘హోస్ట్ గా బాలయ్య...'ఆహా'లో ‘'Unstoppable With NBK' పేరుతో ప్రసారం!

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలయ్య (Balakrishna) సరసన అఖండ సినిమా(Akhanda Movie)లో హీరోయిన్‍గా నటిస్తోంది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వం వహిస్తుండగా.. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. ప్రగ్యాజైస్వాల్ కరోనా బారిన పడడంతో అఖండ చిత్రయూనిట్ ఒక్కసారిగా షాకయ్యింది. ఈ చిత్రంలో జగపతి బాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News