Uttar Pradesh: ఓ 17 ఏళ్ల బాలికపై దాదాపు 28 మంది కొన్ని సంవత్సరాల పాటు అత్యాచారం(Rape) చేసిన ఘటన యూపీలో వెలుగు చూసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఈ దారుణాలకు మూలకారకుడు కావడం ప్రతిఒక్కరినీ నివ్వెరపరుస్తోంది. తన తండ్రి, బీఎస్పీ(Bahujan Samajwadi Party), ఎస్పీ (Samajwadi Party)పార్టీలకు చెందిన నేతలు, సమీప బంధువులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు ఆరోపించింది. ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh)లోని లలిత్పూర్ జిల్లా(Lalitpur district)లో ఈ కేసు నమోదైందని ఓ మీడియా సంస్థ పేర్కొంది. ఆ బాలిక వెల్లడించిన వివరాల ప్రకారం...
‘'మా నాన్న ట్రక్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. నేను ఆరో తరగతి చదువుతున్న సమయంలోనే.. నాకు అసభ్యకరమైన చిత్రాలు చూపించి, లైంగికంగా లొంగదీసుకొనేందుకు ప్రయత్నించాడు. నేను దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాను. ఆ తర్వాత నమ్మించి ఒకరోజు నాకు కొత్త బట్టలు కొనిచ్చి, బైక్‌పై బయటకు తీసుకెళ్లాడు. ఓ నిర్జన ప్రదేశంలో నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే.. మా అమ్మను చంపేస్తానని బెదిరించాడు. ఇది ఇక్కడితో ఆగలేదు. ఆ ఘటన తర్వాత మా నాన్న(Father) ఒకరోజు మత్తుమందు కలిపిన అన్నం తినిపించాడు. తర్వాత నన్ను ఒక హోటల్‌కి తీసుకెళ్లాడు. అక్కడ నాపై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నాకు స్పృహ వచ్చేసరికి నా ఒంటిపై దుస్తులు లేవు. తీవ్రంగా కడుపునొప్పి వచ్చింది. ప్రతిసారి నాకు ఇదే పరిస్థితి ఎదురయ్యేది. ఎవరో కొత్త వ్యక్తి వచ్చేవాడు. ఏ మాత్రం జాలి లేకుండా లైంగిక దాడికి పాల్పడేవాడు. ఇలా ఎన్నోసార్లు జరిగింది. ఒకసారి తిలక్ యాదవ్ వచ్చాడు. నేను వ్యతిరేకించడంతో నీ తండ్రే పంపాడంటూ అత్యాచారానికి పాల్పడ్డాడు. తిలక్‌తోపాటు ఆయన స్నేహితులు, బంధువులు, మా బంధువులు నన్ను ఇలాగే తీవ్రంగా హింసించారు' అంటూ తన దయనీయ పరిస్థితిని పోలీసులకు వెల్లడించింది.
Also Read: Jammu Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లో తెగబడిన ఉగ్రవాదులు, ఐదుగురు జవాన్ల మృతి
బాధితురాలి ఫిర్యాదుపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) జిల్లా అధ్యక్షుడు తిలక్ యాదవ్(Tilak Yadav)సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన విడుదల చేశారు. తనని, తన సోదరులను ఈ కేసులో ఇరికిస్తున్నారని పేర్కొన్నారు. అత్యాచార ఆరోపణల్ని కొట్టిపారేశారు. ఏది ఏమైనప్పటికీ.. ఆ బాధితురాలు ఎదుర్కొన్న దారుణ పరిస్థితి ప్రతిఒక్కరి హృదయాలను కలచివేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook