Sasikala Political Reentry: ఇవాళ అమ్మ సమాధికి శశికళ, కీలక ప్రకటన చేసే అవకాశం

Sasikala Political Reentry: తమిళనాట రాజకీయాల్లో ప్రకంపనలు రానున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షం ఏఐఏడీఎంకే వర్గాల్లో కలవరం కల్గిస్తోంది. ఇవాళ అమ్మ సమాధికి రానున్న శశికళ కీలక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. శశికళ పొలిటికల్ రీఎంట్రీపై ఆ ప్రకటన ఉంటుందనే ప్రచారం ఎక్కువగా ఉంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 16, 2021, 12:50 PM IST
  • ఇవాళ అమ్మ సమాధికి శశికళ, కీలక ప్రకటన చేసే అవకాశం
  • అక్టోబర్ 17న ఏఐఏడీఎంకే వ్యవస్థాపక దినోత్సవం, పార్టీ స్థాపించి 50 ఏళ్లు
  • పార్టీ 50 ఏళ్లు వేడుకల సందర్బంగా కేడర్‌లో చొచ్చుకెళ్లేందుకు శశికళ వ్యూహం
Sasikala Political Reentry: ఇవాళ అమ్మ సమాధికి శశికళ, కీలక ప్రకటన చేసే అవకాశం

Sasikala Political Reentry: తమిళనాట రాజకీయాల్లో ప్రకంపనలు రానున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షం ఏఐఏడీఎంకే వర్గాల్లో కలవరం కల్గిస్తోంది. ఇవాళ అమ్మ సమాధికి రానున్న శశికళ కీలక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. శశికళ పొలిటికల్ రీఎంట్రీపై ఆ ప్రకటన ఉంటుందనే ప్రచారం ఎక్కువగా ఉంది.

తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఏఐఏడీఎంకే(AIADMK) అలియాస్ అన్నాడీఎంకే పార్టీ స్థాపించి రేపటికి 50 సంవత్సరాలు. ఈ సందర్భంగా ఇవాళ అమ్మ సమాధికి రానున్నారు జయలలిత(Jayalalitha) నెచ్చెలి, చిన్నమ్మ శశికళ. అమ్మ సమాధి సందర్శన అనంతరం అక్కడ్నించే కీలకమైన ప్రకటన చేసే అవకాశాలున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా తన రాజకీయ పునర్‌ప్రవేశంపై ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. అన్నాడీఎంకే పార్టీ స్థాపనకు 50 ఏళ్లు(AIADMK at 50 Years)పూర్తయిన నేపధ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలకు సిద్ధమౌతున్నారు. ఈ సమయాన్ని అనుకూలంగా మల్చుకోవాలనేది చిన్నమ్మ వ్యూహంగా ఉంది. అందుకే ఇవాళ అమ్మ సమాధిని సందర్శించి..పొలిటికల్ రీఎంట్రీపై కీలక ప్రకటన చేయవచ్చని సమాచారం. 

వాస్తవానికి బెంగళూరు జైలు నుంచి విడుదలవుతూనే అన్నాడీఎంకే పార్టీ పెద్దలకు ఆందోళన కల్గించారు శశికళ(Sasikala). పార్టీ పగ్గాలు చేపడతానంటూ ప్రకటించి మద్దతుదారుల్లో ఉత్సాహం రేకెత్తించారు. బెంగళూరు జైలు(Bengaluru Jail)నుంచి చెన్నైకు భారీ ఊరేగింపుతో వచ్చి కలకలం సృష్టించారు. అయితే హఠాత్తుగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్ణయం మార్చుకుని, రాజకీయాలకు దూరంగా ఉంటానని వెల్లడించారు. ఇటీవల మరోసారి నేనొస్తున్నా అంటూ కేడర్‌కు ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా నమదు ఎంజీఆర్ పత్రిక ద్వారా రోజుకో ప్రకటన చేస్తున్నారు. పార్టీ అందరిదని..అందరూ సమానమేనంటూ వ్యాఖ్యానాలు చేశారు. పార్టీకి నేతృత్వం వహించేవారు కేడర్‌ను బిడ్డలుగా చూసుకోవల్సిన అవసరముందంటూ పార్టీ పెద్దలకు పరోక్షంగా సంకేతాలు పంపించారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం, 50 ఏళ్ల సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ కేడర్‌లో చొచ్చుకెళ్లేందుకు వ్యూహం పన్నుతున్నారు. ఇవాళ శశికళ చేసే ప్రకటన(Sasikala Political Reentry) కోసం అటు పార్టీ పెద్దలతో పాటు అభిమానులు, పార్టీ కేడర్ ఎదురు చూస్తోంది. 

Also read: Tamilnadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు, మళ్లీ వస్తోన్న చిన్నమ్మ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News