Encounter: తెలంగాణ-ఛత్తీస్‌గడ్ సరిహద్దు మరోసారి కాల్పులతో ప్రతిధ్వనించింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ములుగు అటవీప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ వివరాలిలా ఉన్నాయి.
ఛత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దులోని(Telangana -Chhattisgarh Border) అటవీ ప్రాంతంలో మరోసారి రణరంగం చోటుచేసుకుంది. ములుగు-బీజాపూర్ జిల్లా తర్లగూడ అటవీ ప్రాంతంమంతా కాల్పులతో ప్రతిధ్వనించింది. ఇక్కడ జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో (Encounter)మావోయిస్టులు మరణించినట్టు సమాచారం. మృతి చెందిన మావోయిస్టుల్లో ఛత్తీస్‌గఢ్ దక్షిణ బస్తర్ డివిజన్‌కు చెందిన మావోయిస్టు నేత బద్రు అలియాస్ కల్లు, మహారాష్ట్ర గడ్చిరోలి డివిజన్ నేత కమ్మలను ఇప్పటికే పోలీసులు గుర్తించారు. మరో మావోయిస్టును గుర్తించాల్సి ఉంది. మరోవైపు ఆరుగురు మావోయిస్టులు ఈ ప్రాంతం నుంచి తప్పించుకున్నారని తెలుస్తోంది.
చత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో తప్పించుకున్నవారిలో మావోయిస్టు అగ్రనేతలున్నారని(Maoist killed in Encounter)సమాచారం. ఘటనా ప్రాంతంలో ఏకే 47, ఎస్ఎల్ఆర్ రైఫిల్స్ లభ్యమయ్యాయి. ఎస్ఎల్ఆర్ వెపన్స్ కీలక నేతలు మాత్రమే వాడే అవకాశాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి మావోయిస్టు పార్టీ కీలక నేత హిడ్మా తెలంగాణ సరిహద్దుల్లో ప్రవేశించాడనే సమాచారంతో గత వారం రోజుల్నించి పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ జరుపుతున్నారు. చర్ల, వాజేడు, వెంకటాపురం అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది. పోలీసులు కూంబింగ్(Combing operation) జరుపుతున్న సమయంలోనే మావోయిస్టులు ఎదురుపడటంతో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.
Also read: Mann ki Baat: ఆ కాలం చెల్లింది..మహిళలే ఇక కీలకమంటున్న ప్రధాని మోదీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి