AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్ లో వివిధ కారణాలతో ఎన్నికలు జరగని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలకు నేడు (నవంబరు 15) ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నెల్లూరు నగరపాలక సంస్థ సహా పలు మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు, వివిధ మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న వార్డులు/డివిజన్లలో సోమవారం నిర్వహించే పురపోరుకు సర్వం సిద్ధమైంది. పోలింగ్‌ను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌కు అవసరమైన సామాగ్రిని ఆదివారం పంపిణీ చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది.
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లోని అన్ని డివిజన్లతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడు.. కృష్ణా జిల్లాలో జగ్గయ్య పేట, కొండపల్లి.. గుంటూరు జిల్లాలో దాచేపల్లి, గురజాల.. ప్రకాశం జిల్లాలోని దర్శి.. నెల్లూరు జిల్లాలోని బుచ్చి రెడ్డి పాలెంలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న చిత్తూరు జిల్లాలోని కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలను అధికార ప్రతిపక్ష పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరోవైపు కర్నూలు జిల్లాలో బేతం చర్ల , కడప జిల్లాలో కమలాపురం, కడప జిల్లా రాజంపేట, అనంతపురం జిల్లాలో పెనుకొండ మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగుతున్నాయి.
వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగని వార్డుల్లోనూ ఎన్నికల కమిషన్ పోలింగ్ నిర్వహిస్తోంది. గ్రేటర్ విశాఖలో రెండు డివిజన్ స్థానాలకు, విజయనగరం, కాకినాడ, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 10 డివిజన్ల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గ్రేటర్ విశాఖలో 31, 61 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, కృష్ణా జల్లా నూజివీడు, గుంటూరు జిల్లా రేపల్లె, మాచర్ల, ప్రకాశం జిల్లా అద్దంకి, కడప జిల్లాలో బద్వేలు, చిత్తూరు జిల్లా నగరి, కర్నూలు జిల్లా నందికొట్కూరు, ఎమ్మిగనూరు, అనంతపురం జిల్లా రాయదుర్గంలో పలు వార్డులకు ఎన్నిక నిర్వహిస్తున్నారు.
Also Read: Earthquake In Vizag: వైజాగ్ లో భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు
Also Read: Visakhapatnam: ప్రేమను నిరాకరించిందని.. యువతిపై పెట్రోల్ తో దాడి..ఆపై...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook