Telangana: ప్రభుత్వ అధికారి అంటే ప్రజలకు సేవ చేయడం మాత్రమే కాదు..తన పనులతో పది మందికి స్ఫూర్తిగా నిలవాలి. తను చేసే పనులు ఉన్నతంగా ఉండి..అనుసరించే విధంగా నడుచుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆస్రత్రుల్లో చికిత్స తీసుకోవడం, ప్రభుత్వ బడుల్లో తమ పిల్లలను చదివించడం వంటి పనులు చేస్తే వారిని సామన్య ప్రజానీకం సైతం అనుసరించే అవకాశం ఉంది.
అందుకనే ఇటీవల తెలంగాణ(Telangana)కు చెందిన కలెక్టరు(collector), కలెక్టరు భార్య ప్రభుత్వాస్పత్రిలో చేరి.. బిడ్డకు జన్మనిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స ప్రయివేట్ వాటికంటే ఏ విధంగా తక్కువ కాదంటూ చెప్పకనే తమ తీరుతో చెప్పేశారు. అయితే తాజాగా మరో జిల్లా కలెక్టర్ తన ఇద్దరు కూతుళ్లను అంగన్ వాడి కేంద్రానికి పంపిస్తూ.. పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
Also Read: Bhadradi Kothagudem: ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్తగూడెం కలెక్టర్ భార్య ప్రసవం
వివరాల్లోకి వెళ్తే..
కుమురం భీం జిల్లా కలెక్టరు రాహుల్‌రాజ్(Komaram Bheem district collector rahul raj)కు ఇద్దరు కుమార్తెలు. తన పిల్లలైనా నిర్వికరాజ్, రిత్వికరాజ్‌లను అంగన్వాడీ కేంద్రాని(Anganwadi Center)కి పంపిస్తున్నారు కలెక్టర్. ఈ ఇద్దరు చిన్నారులు జన్కాపూర్-1 కేంద్రంలోని తమ తోటి పిల్లల్తో ఆడుతూపాడుతూ చిన్న చిన్న పదాలను వల్లే వేస్తూ.. సంతోషంగా గడుపుతున్నారు. కలెక్టరు పిల్లలు మూడు నెలలుగా ఇక్కడికి వస్తున్నారని, ఇక్కడే భోజనం చేస్తున్నారని అంగన్వాడీ టీచర్ అరుణ తెలిపారు. ఈ విషయం సోషల్ మీడియా(Social Media)లో వైరల్ కావడంతో కలెక్టరు రాహుల్‌రాజ్ పై నెటిజన్లు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook