South Africa's president has condemned travel bans enacted against his country: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ భయాలతో పలు దేశాలు అంతర్జాతీయ ప్రయాణికులపై నిషేధం విధిస్తున్నాయి. ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్‌ను తొలుత గుర్తించిన దక్షిణాఫ్రికా సహా దాని సరిహద్దు దేశాల నుంచి ప్రయాణికులను అనుమతించకుండా చర్యలు తీసుకుంటున్నాయి.
అయితే ప్రస్తుత పరిస్థితులపై దక్షిణాఫ్రికా విచారం వ్యక్తం చేసింది. తమ దేశంపై ప్రయాణ ఆంక్షలు విధించడం అన్యాయమని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామపోస ఆదివారం (Cyril Ramaphosa condemned travel bans) పేర్కొన్నారు.
కరోనా తాజా పరిస్థితులపై ప్రసంగించిన ఆయన.. వివిధ దేశాలు ఇలాంటి ప్రయాణ ఆంక్షలు విధించడాన్ని తప్పుబట్టారు. వెంటనే ఆయా దేశాలు నిషేధాని ఎత్తివేయాలని (Cyril Ramaphosa called for the bans to be urgently lifted) కోరారు.
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో బ్రిటన్, యురోపియన్ యూనియన్, అమెరికా వంటి దేశాలు దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. తాజాగా జపాన్ కూడా ఈ జాబితాలో చేరింది. ఇజ్రాయెల్ సహా మరిన్ని దేశాలు ఆ దిశగా చర్యలు ముమ్మరం చేశాయి.
రామపోస ఇంకా ఎం చప్పారంటే..
కొత్త వేరియంట్‌ను గుర్తించి ముందుగానే ప్రపంచ దేశాలను హెచ్చరించినట్లు రామపోస గుర్తు చేశారు. అయితే దీని వల్ల ముప్పు ఏ స్థాయిలో ఉందనే విషయంపై ఇంకా శాస్త్రీయమైన సమాచారం లేదన్నారు. అంతలోపే పలు దేశాలు ఆంక్షలు విధించడాన్ని తప్పు బట్టారు.
ఒమిక్రాన్ వేరియంట్‌ను ప్రమాదకారిగా ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సైతం దేశాలు ట్రావెల్ బ్యాన్‌ను విధించొద్దని (World Health Organization on travel bans) సూచించింది. దీనికి బదులు శాస్త్రీయపరమైన ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని సలహా ఇచ్చింది.
అయితే ప్రయాణ ఆంక్షల వల్ల కరోనాను నియంత్రించ గలమని శాస్త్రీయపరమైన ఆధారాలు లేవని రామపోస పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా ప్రయాణ నిషేధాల వల్ల దక్షిణాఫ్రికా వివక్షకు గురవుతుందన్నారు.
ప్రయాణ ఆంక్షల వల్ల కేవలం ఆర్థికంగా మరింత నష్టం వాటిళ్లుతుందే తప్పా.. ఎలాంటి ప్రయోజనం ఉండదని వెల్లడించారు రామపోస. అందుకే ఏ దేశాలైతే ట్రావెల్ బ్యాన్ నిర్ణయం తీసుకుననాయే వెంటనే వాటిని ఉపసంహరించుకుని.. తమ దేశం ఆర్థికంగా మరింత క్షీణించకుండా చూడాలని విజ్ఞప్తి చశారు.
దీనితో పాటు.. ప్రపంచ దేశాల్లో టీకా అసమానతల ఉండకూడదనే విషయానికి ఓ మెల్కోలుపే ఒమిక్రాన్ వేరింయంట్ అని అభిప్రాయపడ్డారు. అందరికీ కరోనా టీకా అందే వరకు మరిన్ని వేరియంట్లు వస్తూనే ఉంటాయని హెచ్చరించారు.
ప్రస్తుతం తమ దేశంలో వ్యాక్సిన్ కొరత లేదని స్పష్టం చేశారు రామపోస. వీలైనంత త్వరంగా అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని.. కరోనాను నియంత్రించేందుకు అదొక్కటే ఉత్తమ మార్గమని స్పష్టం చేసారు.
ఇదే విషయంపై ఇంతకు ముందు స్పందించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా వివిధ దేశాలు ప్రయాణ ఆంక్షలు విధించడాన్ని తప్పుబట్టింది. ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసినందుకు.. తమ దేశం ప్రశంసలకు బదులు శిక్షకు గురువుతోందని అభిప్రాయపడింది.
ఒమిక్రాన్ వేరియంట్ కేసులు దక్షిణాఫ్రికాలో గుర్తించగా.. ఆ కేసులు జర్మనీ, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, బ్రిటన్ వంటి దేశాల్లోను బయటపడ్డాయి.
Also read: Omicron: ఏమిటి ఒమిక్రాన్ వేరియంట్? ఇది ఎందుకంత డేంజర్?
Also read: Omicron strain: ఒమిక్రాన్ వేరియంట్ భయాలు- కఠిన ఆంక్షల దిశగా ఇజ్రాయెల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook