Eatala Rajender: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (CM KCR) బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatala Rajender) మరోసారి తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ పేదల పక్షాన ఉండే నాయకుడు కాదని... బ్రోకర్లు, వందల ఎకరాలు ఆక్రమించుకున్నవారు, ధనవంతులకే ఆయన వత్తాసు పలుకుతారని విమర్శించారు. టీఆర్ఎస్‌లో (TRS) ఉద్యమకారులకు చోటు లేదని... కేవలం భజనపరులకే చోటు ఉందని మండిపడ్డారు. ఈటల రాజేందర్ సోమవారం (నవంబర్ 29) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో పర్యటించారు. స్థానిక తెలంగాణ నగర్ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ... తెలంగాణ నగర్‌లో ఉండేదంతా పేద ప్రజలేనని.. అందుకే కేసీఆర్ (CM KCR) వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వట్లేదని అన్నారు. ప్రభుత్వ స్థలమని చెప్పి ఇక్కడి పేదలకు పట్టాలు ఇవ్వని కేసీఆర్... ఇక డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఏమిస్తారని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాల ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. తెలంగాణలో (Telangana) కేసీఆర్‌ను ఢీకొట్టే పార్టీ బీజేపీనే అని... వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
హుజురాబాద్ ఉపఎన్నికలో విజయంతో ఈటల రాజేందర్ (Eatala Rajender) రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ను ఆయన టార్గెట్ చేస్తున్నారు. ఆదివారం (నవంబర్ 28) ఈటల యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. రైతు ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవసరానికి మించి ధాన్యం కొనుగోలు చేయలేమని కేంద్రం ముందే చెప్పిందన్నారు. అయినప్పటికీ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో కేసీఆర్ (CM KCR) విఫలమయ్యారని ఆరోపించారు. కేసీఆర్ (CM KCR) తీరుతో తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటను కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు.
Also Read: దక్షిణాఫ్రికా నుంచి 185 మంది ప్రయాణికులు..11 మందికి పాజిటివ్! భయాందోళనలో హైదరాబాద్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook