Yogurt for High Blood Pressure: ఆహారంలో పెరుగు తీసుకోవడం వల్ల శరీరంలోని అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా, యూనివర్సిటీ ఆఫ్ మైనే కలిసి నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. రోజూ తినే ఆహారంలో పెరుగు తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుందని తేలింది. దీంతో పాటు క్రమం తప్పకుండా పెరుగు తినే వారు గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం తక్కువ అని పరిశోధకులు అంటున్నారు.
పెరుగు వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు..
ఈ అధ్యయనంలో, అధిక రక్తపోటు ఉన్న రోగులలో పెరుగు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు (Yogurt Benefits). ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని తెలిపారు. అధిక రక్తపోటు ఉన్న రోగులు ప్రతిరోజూ పెరుగు తీసుకుంటే, అది రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.
ఈ అధ్యయనం కోసం 915 మంది వాలంటీర్లపై పరిశోధనలు చేశారు. పరిశోధనల ద్వారా వచ్చిన ఫలితాలను ఆ తర్వాత బహిర్గతం చేశారు. అధిక రక్తపోటు వల్ల కార్డియోవాస్క్యులార్ వ్యాధుల ముప్పు పెరుగుతుందని, అయితే ప్రతిరోజూ పెరుగు తింటే అది మీకు మేలు చేస్తుందని పరిశోధకులు రుజువు చేశారు.
రక్తపోటును నియంత్రించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది అని వారు అంటున్నారు. హైపర్టెన్సివ్ రోగులలో పెరుగు ద్వారా చేసిన ఈ అధ్యయనం సానుకూల ఫలితాలను రప్పించింది.
అధిక రక్తపోటు వల్ల గుండె సంబంధ వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి అధిక రక్తపోటుతో బాధ పడుతున్న వారు.. దాన్ని నియంత్రించుకునేందుకు మార్గాలను కనుగొనడం ముఖ్యం. డైరీ ఫుడ్ లో ముఖ్యంగా పెరుగు.. రక్తపోటు పై ప్రభావం చూపుతుందని పరిశోధకులు డాక్టర్ కపూర్, అలెగ్జాండ్రా వాడే తెలిపారు.
పాల ఉత్పత్తుల్లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక సూక్ష్మపోషకాలు ఉంటాయి. ఈ కారకాలన్నీ రక్తపోటును తగ్గించడానికి లేదా నియంత్రించడానికి ఉపయోగపడతాయి.
పెరుగులోని ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియా.. ప్రోటీన్ల విడుదలను ప్రోత్సహిస్తుంది. దీంతో రక్తపోటును తగ్గుదల అయ్యే అవకాశం ఉంది. మరోవైపు, క్రమం తప్పకుండా పెరుగు తినేవారిలో రక్తపోటును 7 పాయింట్ల వరకు తగ్గిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఓ అధ్యయనాన్ని అనుసరించి రాసినది. దయచేసి ఇది పాటించే ముందు సంబంధిత వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది. ZEE మీడియా ఈ అధ్యయనాన్ని ధ్రువీకరించలేదు.
Also Read: Milk with Tulsi: పాలల్లో తులసిని కలిపి తీసుకుంటే... ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు...
Also Read: Healthy Tips for Skin: రోజూ స్నానం చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook